IPL Auction 2025 Live

Telangana: ఎస్సై కాదు కామాంధుడు, నీ న్యూడ్ వీడియోలు, ఫోటోలు బయపెడతానంటూ వేధింపులు, రూ. 50 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్, సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు

అవినీతి ఆరోపణల నేపథ్యంలో (corruption allegations) వరంగల్ రూరల్ మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ జి సతీష్ కుమార్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి సస్పెండ్ (Warangal Rural SI suspended) చేశారు.ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసినట్లు సీపీ కార్యాలయం ఆదివారం విడుదల చేసిన నోట్‌లో పేర్కొంది.

SI Suspended (Photo-File Image)

Hyd, Sep 25: అవినీతి ఆరోపణల నేపథ్యంలో (corruption allegations) వరంగల్ రూరల్ మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ జి సతీష్ కుమార్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి సస్పెండ్ (Warangal Rural SI suspended) చేశారు.ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసినట్లు సీపీ కార్యాలయం ఆదివారం విడుదల చేసిన నోట్‌లో పేర్కొంది.తన న్యూడ్‌ వీడియోలు, ఫొటోస్‌తో సీఐ వేధింపులకు గురిచేస్తున్నారని ఓ మహిళ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి సుబేదారి ఉమెన్‌ పీఎస్‌లో పనిచేస్తున్న సీఐ సతీష్‌కుమార్‌ను సస్పెండ్‌ చేశారు. వివిధ కేసుల్లో ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళలను సీఐ డబ్బులు కోసం వేధింపులకు గురిచేస్తున్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.తన వేధిస్తున్నాడని సుబేదారి ఉమెన్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళ నుంచి కేసు నమోదు చేయడానికి రూ.50వేల లంచం తీసుకున్నట్లు సీఐపై ఆరోపణలు వచ్చాయి.

పొదల్లో బట్టలు లేకుండా పడిఉన్న వివాహిత, ఇద్దరు పిల్లల తల్లికి మత్తుమందు ఇచ్చి అత్యాచారం, జహీరాబాద్‌లో సంచలనం సృష్టించిన గ్యాంగ్ రేప్‌, కూకట్‌పల్లి నుంచి ఆటోలో తీసుకువచ్చి అత్యాచారం చేసినట్లు గుర్తింపు

సీఐ వ్యవహారాలపై విచారణ చేపట్టిన సీపీ తరుణ్‌ జోషి.. సతీష్‌ను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సీఐపై అవినీతి ఆరోపణలతో పాటు, లైంగిక వేధింపుల ఆరోపణలు స్థానికంగా కలకలం సృష్టిస్తున్నాయి.