Gang Rape in Zaheerabad: పొదల్లో బట్టలు లేకుండా పడిఉన్న వివాహిత, ఇద్దరు పిల్లల తల్లికి మత్తుమందు ఇచ్చి అత్యాచారం, జహీరాబాద్‌లో సంచలనం సృష్టించిన గ్యాంగ్ రేప్‌, కూకట్‌పల్లి నుంచి ఆటోలో తీసుకువచ్చి అత్యాచారం చేసినట్లు గుర్తింపు
Image used for representational purpose only | (Photo Credits: ANI)

Hyderabad, SEP 25: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో (Zaheerabad) దారుణం చోటుచేసుకుంది. జహీరాబాద్ పట్టణ శివారులోని డిడిగి గ్రామంలోని నిర్మానుష్య ప్రాంతంలో వివాహితపై సామూహిక అత్యాచార (Gang rape) జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 24ఏళ్ల వివాహితను గుర్తుతెలియని వ్యక్తులు ఆటోలో జహీరాబాద్ తీసుకువచ్చి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వివాహితను సికింద్రాబాద్‌లోని (Secundrabad) సమీప ప్రాంత వాసిగా గుర్తించారు. ఆటో ఎక్కిన వివాహితకు మత్తుమందు ఇచ్చారా? జహీరాబాద్ ప్రాంతానికి తీసుకొచ్చాక మద్యం తాగించారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శుక్రవారం రాత్రి కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీ (KPHB) నుంచి వివాహితను తీసుకొచ్చి జహీరాబాద్‌లో అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం.

Kakinada Shocker: మా అమ్మను నాన్న ఇలా గొంతు నొక్కి చంపాడు, కాకినాడ వివాహిత హత్యకేసులో తండ్రే హంతకుడని కూతురు వాంగ్మూలం, బిడ్డ నల్లగా పుట్టిందని అనుమానంతోనే చంపినట్లు కుటుంబ సభ్యుల ఆరోపణ, మూర్చవచ్చి చనిపోయిందని నమ్మించేయత్నం 

అత్యాచారం (Rape) చేసిన తర్వాత ఆమెను అక్కడే వదిలి వెళ్లారు. శనివారం ఉదయం అచేతన స్థితిలో పడి ఉన్న ఆమెను స్థానిక వ్యక్తి గుర్తించి జహీరాబాద్‌ పోలీసులకు సమాచారం అందించారు. వివాహితకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్నాళ్లుగా భర్తతో దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. బాధితురాలిని పోలీసులు సంగారెడ్డిలోని సఖీ కేంద్రానికి తరలించారు.

Rajasthan Shocker: అంకుల్ ఇంట్లో లేడా ఆంటీ అంటూ, ఇంట్లోకి ప్రవేశించి, వివాహితపై అత్యాచారం జరిపిన యువకుడు, వీడియో తీసి బ్లాక్ మెయిల్.. 

సామూహిక అత్యాచారం ఘటనను పోలీసులు అత్యంత గోప్యంగా ఉంచి దర్యాప్తు చేపట్టడంపైనా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఘటనపై మాట్లాడేందుకు జహీరాబాద్ డీఎస్పీ రఘు నిరాకరించారు.