Telangana Weather Report: తెలంగాణలో మండిపోతున్న ఎండలు, 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు, ఖైరతాబాద్‌లో అత్యధికంగా 42.5 డిగ్రీల ఉష్ణోగ్రత
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వరుసగా ఎనిమిదో రోజు 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. భారీ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో.. జనాలు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు.రాష్ట్రంలో కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వరుసగా ఎనిమిదో రోజు 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. భారీ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో.. జనాలు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు.రాష్ట్రంలో కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
కరీంనగర్ జిల్లాలోని వీణవంక, నల్లగొండ జిల్లాలోని దామరచర్లలో 45.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. నిర్మల్ జిల్లా కడెం పెద్దూరులో 45.1 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా జన్నారంలో 44.9, సూర్యాపేట జిల్లా మోతెలో 44.8, గరిడేపల్లిలో 44.8, మంచిర్యాల జిల్లా దండేపల్లిలో 44.5, రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రాంగిలో 44.5, కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో 44.5, పెద్దపల్లి జిల్లా ముత్తారంలో 44.5, పెద్దపల్లి జిల్లా రామగుండంలో 44.5, కుమ్రం భీం జిల్లా కెరిమెరిలో 44.4, నిజామాబాద్ జిల్లా భోధన్‌లో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
హైదరాబాద్ నగరంలో ఖైరతాబాద్‌లో అత్యధికంగా 42.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కాప్రాలో 41.3, ఉప్పల్‌లో 41.2, చార్మినార్‌లో 41.1, కుత్బుల్లాపూర్‌లో 40.9, నాంపల్లిలో 40.7, సరూర్‌నగర్‌లో 40.5, కూకట్‌పల్లిలో 40.4, హిమాయత్‌నగర్‌లో 40.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.