Hyderabad Temperatures: హైదరాబాద్ సహా తెలంగాణలో ఈరోజు, రేపు మండిపోనున్న ఎండలు
తెలంగాణలో పలు జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు బెంబేలెత్తిస్తున్నాయి. ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతోంది.
Hyderabad, Apr 16: తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలో (Telangana) పలు జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు బెంబేలెత్తిస్తున్నాయి. ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతోంది. హైదరాబాద్ సహా తెలంగాణలో పలు జిల్లాల్లో నిన్నటి కన్నా ఈరోజు, రేపు ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో పాటు వడగాలుల ముప్పు కూడా ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది.