TGSPDCL: విద్యుత్ సిబ్బంది లంచం అడిగితే ఈ నెంబర్లకు ఫోన్ చేయాలన్న సీఎండీ ముషరఫ్ ఫరూఖీ, ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని వెల్లడి

దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ పరిధిలో మా సిబ్బంది/అధికారులు ఏదైనా పనికి లంచం అడిగితే 040 - 2345 4884 కు గాని లేదా 768 090 1912 కు కాల్ చేసి ఫిర్యాదుచేయగలరని సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖి విద్యుత్ వినియోగదారులకు తెలిపారు.

TGPDCL CMD Musharraf Farooqi about toll free numbers

Hyd, Sep 6: మా సిబ్బంది/అధికారులు ఏదైనా పనికి లంచం అడిగితే నా కార్యాలయానికి తెలియజేయాలన్నారు సీఎండీ ముషారఫ్ ఫరూఖి. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ పరిధిలో మా సిబ్బంది/అధికారులు ఏదైనా పనికి లంచం అడిగితే 040 - 2345 4884 కు గాని లేదా 768 090 1912 కు కాల్ చేసి ఫిర్యాదుచేయగలరని సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖి విద్యుత్ వినియోగదారులకు తెలిపారు.

సంస్థ తమ విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడానికి గాను, పలు అత్యున్నత ప్రమాణాలను పాటిస్తున్నది. కొంత మంది సిబ్బంది, అధికారులు అవినీతికి పాల్పడుతూ సంస్థ కు చెడ్డపేరు తెస్తున్నారు. ఈ నేపధ్యం లో వినియోగదారుల సమస్యలు/ఫిర్యాదులు నేరుగా తెలుసుకుని వాటిని పరిష్కరించి అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు సీఎండీ తెలిపారు.

ఇప్పటికే నూతన సర్వీసుల మంజూరు, క్యాటగిరీ మార్పు, టైటిల్ ట్రాన్స్ ఫర్, బిల్లింగ్ లోపాలు వంటి ఇతర సేవలు పొందేందుకు సంస్థ వెబ్సైట్ మరియు మొబైల్ యాప్ ల ద్వారా నమోదు చేసుకునే అవకాశం కల్పించబడింది.   విప్లవాత్మక మార్పులకు హైదరాబాద్ పెట్టింది పేరు, గ్లోబల్‌ ఏఐ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, సరికొత్త ఆవిష్కరణలు ప్రపంచాన్ని మార్చాయని వెల్లడి 

సంస్థ పరిధిలో అవినీతి రహిత వాతావరణ కల్పించడానికి, వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడానికి సంస్థ కట్టుబడి వున్నది. వినియోగదారులకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించడం మరియు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని పేర్కొన్నారు.



సంబంధిత వార్తలు

Patnam Narender Reddy: కలెక్టర్ పై దాడి కేసులో A1గా పట్నం నరేందర్ రెడ్డి, కస్టడీపై పిటిషన్‌పై ఇవాళ కోర్టులో వాదనలు, కలెక్టర్‌పై దాడి బయటివారి పనేనని పోలీసుల వెల్లడి

Uttar Pradesh: వీడియో ఇదిగో, దేవాలయంలో ఏసీ నుంచి కారుతున్న నీటిని తాగేందుకు ఎగబడుతున్న భక్తులు, కోరి కోరి రోగాలు తెచ్చుకోవద్దంటున్న వైద్యులు

Andhra Pradesh: వైసీపీ వాళ్లు ఎవరైనా మాట్లాడితే బొక్కలో వేస్తాం, పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు, జగన్ ప్రభుత్వంలో ఎమ్మార్వో ఆఫీసులనే తాకట్టు పెట్టారని చంద్రబాబు మండిపాటు

Free Gas Cylinders Scheme: ఏపీలో రేపటి నుంచి ఉచిత సిలిండర్ పథకం అమల్లోకి, మూడు సిలిండర్లు ఎప్పుడెప్పుడు బుక్ చేసుకోవాలో తెలుసుకోండి