TGPSC Group 1 Prelims Guidelines: జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష.. పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం.. ఈ ప్రిలిమ్స్ కు మీరు హాజరవుతున్నారా? అయితే, టీజీపీఎస్సీ కీలక సూచనలు చేసింది.. అవేమిటంటే?

తెలంగాణలో 563 గ్రూప్ - 1 కొలువుల భర్తీకి టీజీపీఎస్సీ (గతంలో టీఎస్‌పీఎస్సీ) ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించడానికి సంసిద్ధం అవుతున్నది.

TSPSC (Credits: X)

Hyderabad, May 24: తెలంగాణలో (Telangana) 563 గ్రూప్ – 1 (TGPSC Group-1) కొలువుల భర్తీకి  టీజీపీఎస్సీ (గతంలో టీఎస్‌పీఎస్సీ) ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించడానికి సంసిద్ధం అవుతున్నది. జూన్ 9న ఉదయం 10.30 నుంచి ఒంటిగంట వరకూ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షకు భారీగా 4.03 లక్షల మంది దరఖాస్తు చేసుకోవడంతో టీజీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకున్నది. ఓఎంఆర్ (OMR) విధానంలోనే పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. సీబీఆర్‌టీ విధానంలో పలు సెషన్లలో పరీక్షలు నిర్వహించాల్సి వస్తుండటంతో..ఒక్క రోజులోనే పరీక్ష పూర్తి చేసేందుకు వీలుగా ఓఎంఆర్ పద్ధతిలోనే పరీక్ష నిర్వహించాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది.

అమెరికాలో బైక్ ప్రమాదం.. ఏపీ విద్యార్ధి బీలం అచ్యుత్ దుర్మరణం.. విచారం వ్యక్తం చేసిన ఎంబసీ.. మృతదేహాన్ని భారత్‌ కు తరలించేందుకు ఏర్పాట్లు

ప్రిలిమ్స్‌ కు హాజరయ్యే విద్యార్థులకు టీజీపీఎస్సీ ఈ సందర్భంగా కీలక సూచనలు చేసింది.

బెంగళూరు రేవ్‌ పార్టీ దర్యాప్తు లోతుల్లోకి వెళ్లే కొద్దీ సంచలన విషయాలు, ఇద్దరు తెలుగు నటీనటులు డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్థారణ

పరీక్షా కేంద్రానికి వెళ్లే ముందు..

హాల్ టిక్కెట్లు ఎప్పుడంటే?

హాల్ టిక్కెట్లు జూన్ 1న అందుబాటులోకి వస్తాయి. ప్రిలిమ్స్ లో ప్రతిభ చూపిన వారిని జోన్ల వారీగా పోస్టుల సంఖ్యకు అనుగుణంగా 1:50 నిష్ఫత్తిలో తీసుకుంటారు. రిజర్వుడ్ వర్గాల్లో అభ్యర్థుల సంఖ్య తక్కువైతే మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.