TGSRTC: వీడియో ఇదిగో, ఆర్టీసీ బస్సులో పుట్టిన చిన్నారికి జీవితకాలం పాటు ఉచిత పాస్, ప్రసవం చేసిన స్టాఫ్ నర్స్‌కు ఏడాది పాటు ఉచిత ప్రయాణ సదుపాయం
రాఖీ పౌర్ణమి రోజు గద్వాల డిపో ఆర్టీసీ బస్సులో జన్మించిన చిన్నారికి జీవిత కాలంపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించేలా బస్‌పాస్ అందిస్తున్నట్లు టీజీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది.
రాఖీ పౌర్ణమి రోజు గద్వాల డిపో ఆర్టీసీ బస్సులో జన్మించిన చిన్నారికి జీవిత కాలంపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించేలా బస్‌పాస్ అందిస్తున్నట్లు టీజీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది.ఆర్టీసీ బస్సులు, బస్‌స్టేషన్లలలో పుట్టిన పిల్లలకు జీవితకాలం ఉచిత బస్‌పాస్ ఇవ్వాలని గతంలో యాజమాన్యం తీసుకున్న నిర్ణయం మేరకు తాజాగా ఈ చిన్నారికి ఉచిత బస్‌పాస్ మంజూరు చేస్తున్నట్లు పేర్కొంది. అలాగే ప్రసవం చేసిన స్టాఫ్ నర్స్ అలివేలు మంగమ్మకు డీలక్స్, సూపర్ లగ్జరీ సర్వీసుల్లో ఏడాదిపాటు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మంగళవారం (ఆగస్టు20) ఎక్స్(ట్విటర్) వేదికగా వెల్లడించారు. తెలంగాణలో వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ, భారీ వర్షాలపై ప్రభుత్వం ఫోకస్
బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో గర్భిణీకి పురుటినొప్పులు రావడంతో కాన్పు చేసి మానవత్వం చాటుకున్న కండక్టర్ భారతి, డ్రైవర్ అంజిలతోపాటు నర్సు అలివేలు మంగమ్మను హైదరాబాద్‌లోని సంస్థ ప్రధాన కార్యాలయం బస్‌భవన్‌లో ఆర్టీసీ యాజమాన్యం అభినందించింది.
Here's TGSRTC MD Tweet