Robbers Attack: తెలుగువారిపై మహారాష్ట్రలో దొంగలు దాడి, షిర్డీ నుంచి వస్తుండగా కత్తులతో అడ్డగించిన దొంగల గుంపు, 8 తులాల బంగారం అపహరణ, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు

మహారాష్ట్రలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తెలంగాణ వికారాబాద్ బండవేలికిచర్లకు చెందిన కుటుంబం పై వాసీలో దొంగలు దాడి (Robbers Attack) చేశారు. విచక్షణ రహితంగా చిన్న పిల్లలు, మహిళలు అని చూడకుండా కత్తులతో దాడికి పాల్పడ్డారు.

Representational Image | (Photo Credits: PTI)

Hyderabad, Feb 13: మహారాష్ట్రలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తెలంగాణ వికారాబాద్ బండవేలికిచర్లకు చెందిన కుటుంబం పై వాసీలో దొంగలు దాడి (Robbers Attack) చేశారు. విచక్షణ రహితంగా చిన్న పిల్లలు, మహిళలు అని చూడకుండా కత్తులతో దాడికి పాల్పడ్డారు. షిర్డీ దైవ దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణమైన తెలుగు వారిపై దోపిడీ దొంగలు దాడికి పాల్పడి అందినకాడికి సొమ్మును దోచుకెళ్లారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని వాసీ పోలీస్ స్టేషన్ (Vasi police station) పరిధిలో చోటుచేసుకుంది. గాయపడిన తెలుగువారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఘటన వివరాల్లోకెళితే.. వికారాబాద్‌ జిల్లా ( Vikarabad District) బండవెల్కిచర్ల గ్రామానికి చెందిన కె.రాములు పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు. కుల్కచర్ల తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్‌ రమేశ్‌. వీరిద్దరూ తమ కుటుంబంతో కలిసి మహారాష్ట్రలోని షిర్డీకి కారులో వెళ్లారు. షిర్డీ యాత్ర ముగించుకుని శుక్రవారం తిరుగు ప్రయాణమయ్యారు. రాత్రి రెండు గంటలకు వాసీ సమీపంలో దొంగలు రోడ్డుపై మేకులు వేయడంతో కారు పంక్చర్ అయి బోల్తా పడింది. బోల్తా పడిన సమయంలో రాములు కుటుంబంపై దాడి చేసి దొంగలు బంగారం, నగదు దోచుకు వెళ్ళారు. ప్రస్తుతం హుమ్నాబాద్ లోని ఓ ఆస్పత్రిలో వీరికి చికిత్స జరుగుతోంది.

జీఎన్ సాయిబాబాకు కరోనావైరస్ పాజిటివ్, సిటీ స్కాన్ ఇతర పరీక్షల కోసం ఆస్పత్రికి తరలింపు, వైద్యుల నిర్ణయం తరువాత ఇతర విషయాలు వెల్లడిస్తామని తెలిపిన సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ అనుప్‌ కుమార్‌ కుమ్రే

కాగా చిన్న‌పిల్ల‌లు, మ‌హిళ‌లు అని కూడా చూడ‌కుండా క‌త్తులు, రాళ్ల‌తో విచ‌క్ష‌ణ ర‌హితంగా దాడి చేశారని తెలుస్తోంది. వీరి దాడిలో ఐదుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వీరి వ‌ద్ద నుంచి 8 తులాల బంగారు న‌గల‌ను దొంగ‌లు అప‌హ‌రించుకుపోయారు. మహారాష్ట్ర వాసీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు మరిన్ని రావాల్సి ఉంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement