Thota Lakshmi Kantha Rao: కర్ణాటక ఎన్నికల పరిశీలకుడిగా నియమితులైన తోట లక్ష్మీ కాంతారావు

కర్ణాటక రాష్ట్రంలో మే 10 వ తారీఖున అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కన్వీనర్, జుక్కల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు తోట లక్ష్మీ కాంతారావును ఏఐసీసీ దళిత విభాగం జాతీయ అధ్యక్షులు రాజేష్ లిలోతీయ కర్ణాటకలోని చించోలి నియోజకవర్గ పరిశీలికుడుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

కర్ణాటక రాష్ట్రంలో మే 10 వ తారీఖున అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కన్వీనర్, జుక్కల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు తోట లక్ష్మీ కాంతారావును ఏఐసీసీ దళిత విభాగం జాతీయ అధ్యక్షులు రాజేష్ లిలోతీయ కర్ణాటకలోని చించోలి నియోజకవర్గ పరిశీలికుడుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా తోట లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని చించోలి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే దిశగా తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

Karnataka Elections 2023: సోనియాగాంధీ విషకన్య! కర్ణాటక బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు, కాంగ్రెస్-బీజేపీ మధ్య కొనసాగుతున్న "విష"పూరిత కామెంట్స్‌

తనను నమ్మి ఈ బాధ్యతను అప్పజెప్పిన ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారికి, కొప్పుల రాజు గారికి, ఏఐసీసీ దళిత విభాగం జాతీయ అధ్యక్షులు రాజేష్ లీలోతియకి తెలంగాణ కాంగ్రెస్ దళిత విభాగం చైర్మన్  ప్రీతంకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తనకు అప్పజెప్పిన బాధ్యతను నిర్వర్తించేందుకు సత్వరమే కర్ణాటక బయలుదేరుతున్నట్లు తెలిపారు.