Traffic Advisory: హైదరాబాద్‌లో నిమజ్జనాలు, రేపు నగరంలో 64 ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్, వాహనాల మళ్లింపు రూట్లు ఇవిగో, 25 వేల మంది పోలీసులతో బందోబస్తు
జీహెచ్‌ఎంసీ పరిధిలో వినాయక నిమజ్జనాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఈ మేరకు ట్రాఫిక్ అడిషనల్ పోలీస్ కమిషనర్ విశ్వప్రసాద్ గణేష్ నిమజ్జనంతో పాటు, ట్రాఫిక్ ఆంక్షలపై మీడియాతో మాట్లాడారు.
Hyd, Sep 16: వినాయక ఉత్సవాల్లో అత్యంత కీలకఘట్టమైన సామూహిక నిమజ్జనం సెప్టెంబర్ 17న రేపు జరగనుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో వినాయక నిమజ్జనాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఈ మేరకు ట్రాఫిక్ అడిషనల్ పోలీస్ కమిషనర్ విశ్వప్రసాద్ గణేష్ నిమజ్జనంతో పాటు, ట్రాఫిక్ ఆంక్షలపై మీడియాతో మాట్లాడారు. రేపు ఉదయం నుంచి గణేష్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా మొత్తం 64 చోట్ల ట్రాఫిక్ డైవర్షన్స్ ఏర్పాటు చేసినట్లు విధించినట్లు తెలిపారు. ప్రయాణం సౌకర్యార్థం ప్రజలు ఆర్టీసీ, ఎంఎంటీఎస్, మెట్రో రైళ్లను విస్తృతంగా వాడుకోవాలని తెలిపారు.
ట్యాంక్ బండ్ దగ్గర 8 చోట్ల పార్కింగ్ సదుపాయం కల్పించామని, రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఇప్పటికే గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు (మంగళవారం) మధ్యాహ్నం ఒంటిగంటకు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం జరగనుంది. ఇవాళ్టి నుంచి ఖైరతాబాద్ గణేష్ తరలింపుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. సాయంత్రం 4 గంటల్లోపు బాలాపూర్ గణేష్ నిమజ్జనం జరగనుంచి వెల్లడించారు.
రేపు ఉదయం 7 గంటలకు ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర, ఈ ఏడాది ఖైరతాబాద్ గణపతి హుండీ ఆదాయం ఎంతంటే..
ఇక శోభాయాత్ర మొదలైన రెండు గంటల్లోనే ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం పూర్తి చేస్తామని తెలిపారు. నిమజ్జనాలు, ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో సిటీలోకి భారీ వాహనాలకు పర్మిషన్ లేదని తేల్చి చెప్పారు. నిమజ్జన శోభాయాత్రను ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని ట్రాఫిక్ అడిషనల్ పోలీస్ కమిషనర్ విశ్వప్రసాద్ కోరారు.
సుమారు లక్ష విగ్రహాలను నిమజ్జనానికి తరలి రానున్న నేపథ్యంలో అందుకు సరిపడా ఏర్పాట్లు చేసినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. నిమజ్జనం బందోబస్తు కోసం 25 వేల మంది పోలీసులను సిద్ధం చేశారు. నిమజ్జన ఏర్పాట్లపై గత రెండు నెలలుగా కసరత్తు చేసిన పోలీసులు.. కేవలం హుస్సేన్ సాగర్ చుట్టూ 3 వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది హుస్సేన్‌సాగర్‌లో 25 వేల నుంచి 30 వేల విగ్రహాలు నిమజ్జనమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.మహిళల భద్రతకు షీటీమ్స్‌ను రంగంలోకి దించుతున్నారు. హుస్సేన్‌సాగర్ పరిసర ప్రాంతాల్లోనే 12 షీటీమ్స్ పహారా కాయనున్నాయి.
నిమజ్జన సమయంలో నగర వ్యాప్తంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మొత్తం 67 డైవర్షన్ పాయింట్లు ఏర్పాటు చేశారు. ప్రజలంతా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు వినియోగిస్తే నిమజ్జనం ప్రశాంతంగా వీక్షించవచ్చని పోలీసు ఉన్నతాధికారులు సూచించారు. అత్యవసర సమయాల్లో ట్రాఫిక్ హెల్ప్ లైన్ నంబర్లు 9010203626, 8712660600, 040-27852482 కి ఫోన్ చేయొచ్చని తెలిపారు.
వాహనాల మళ్లింపు ఇలా..
ఎన్టీఆర్ మార్గ్‌లో నిమజ్జనం అనంతరం ఖాళీ వాహనాలను ఖైరతాబాద్ ఫ్లైఓవర్ మీదుగా మళ్లిస్తారు.
నక్లెస్ రోడ్డులో నిజమ్జనం పూర్తయిన తర్వాత వాహనాలు నక్లెస్ రోడ్డు సర్కిల్- ఖైరతాబాద్ ఫ్లైఓవర్ మీదుగా వెళ్లాలి
అర్ధరాత్రి తర్వాత నిమజ్జనం పూర్తయిన వాహనాలు తెలుగుతల్లి ఫ్లైఓవర్, ట్యాంక్‌బండ్, గోశాల, ఇందిరాపార్క్ మీదుగా ఆర్టీసీ క్రాస్‌రోడ్డువైపు మళ్లిస్తారు
మెహదీపట్నం నుంచి వచ్చే బస్సులను మాసబ్ ట్యాక్ వద్ద నిలిపివేస్తారు. కూకట్‌పల్లి నుంచి వచ్చే బస్సులు ఖైరతాబాద్ వద్ద, సికింద్రాబాద్ నుంచి వచ్చే బస్సులను సిటిఓ, ప్లాజా, ఎస్‌బిహెచ్, క్లాక్ టవర్, చిలకలగూడ క్రాస్ రోడ్ వరకు మాత్రమే అనుమతిస్తారు.
గడ్డి అన్నారం, ఛాదర్‌ఘాట్ వైపు వచ్చే వాహానాలు దిల్‌షుఖ్‌నగర్ వద్ద, మిధాని, ఇబ్రహింపట్నం వైపు నుంచి వచ్చే వాహానాలు ఐఎస్‌సదన్ వద్ద, ఇంటర్ సిటి స్పెషల్ బస్సులను నారాయణ గూడ వద్ద నిలిపివేయనున్నారు.
జిల్లా, అంతర్రాష్ట్ర సర్వీసు బస్సులు ఎంజీబీఎస్ వెళ్లేందుకు పోలీసులు రూట్‌మ్యాప్ ఖరారు చేశారు. రాజీవ్ రహదారి నుంచి వచ్చే వాహనాలు జేబీఎస్- సంగీత్- తార్నాక- విద్యానగర్- టి. జంక్షన్- ఫీవర్ ఆస్పత్రి- భర్కత్‌పుర- నింబోలి అడ్డా మీదుగా ఎంజీబీఎస్‌కు వెళ్లాలి.
బెంగళూరు వైపు నుంచి వచ్చే వాహనాలు ఆరంఘర్-చాంద్రాయణగుట్ట-ఐఎస్‌సదన్-నల్గొండ క్రాస్ రోడ్-చాదర్‌ఘాట్ మీదుగా వెళ్లాలి.
ముంబై/ఎన్‌హెచ్9 నుంచి వచ్చే వాహనాలు వై జంక్షన్-బోయిన్‌పల్లి-వైఎంసీఏ-సంగీత్- తార్నాక -విద్యానగర్ టి జంక్షన్-ఫివర్ ఆస్పత్రి- భర్కత్‌పుర-నింబోలి అడ్డా మీదుగా ఎంజీబీఎస్‌కు వెళ్లాలి.