Traffic Monitoring with Drones: హైదరాబాద్ లో పెరుగుతున్న ట్రాఫిక్ కు ‘టెక్’తో చెక్.. డ్రోన్లతో ట్రాఫిక్‌ పర్యవేక్షణ.. సైబరాబాద్‌ పోలీసుల వినూత్న ఆలోచన.. వారంకిందటి నుంచే అందుబాటులోకి

అయితే, టెక్నాలజీని వాడుకోవడంలో ఇప్పటికే ముందున్న సైబరాబాద్‌ పోలీసులు ట్రాఫిక్ చిక్కులకు చెక్ పెట్టడానికి మరో ముందడుగు వేశారు.

Traffic Monitoring with Drones (Credits: Pixabay)

Hyderabad, June 15: విశ్వనగరంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ (Hyderabad) లో ట్రాఫిక్ కష్టాలు (Traffic Issues) కూడా అంతకంతకు పెరుగుతున్నాయి. అయితే, టెక్నాలజీని వాడుకోవడంలో ఇప్పటికే ముందున్న సైబరాబాద్‌ పోలీసులు ట్రాఫిక్ చిక్కులకు చెక్ పెట్టడానికి మరో ముందడుగు వేశారు. ప్రస్తుతం సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో సవాలుగా మారిన ట్రాఫిక్‌ సమస్యను అధిగమించేందుకు వినూత్న రీతిలో డ్రోన్‌ కెమెరాలను (Drone Camera) అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ డ్రోన్‌ల సహకారంతో ఎక్కడైనా ట్రాఫిక్‌ స్తంభిస్తే..ఆ ప్రదేశానికి వెంటనే డ్రోన్‌ కెమెరాలను పంపించి అక్కడి పరిస్థితులను ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలిస్తారు.

రైలులో మంటలు అంటుకున్నాయని పుకార్లు షికార్లు.. భయంతో నడుస్తున్న రైలు నుంచి దూకిన పలువురు ప్రయాణికులు.. ఎదురుగా మరో ట్రాక్ పై వస్తున్న గూడ్స్ రైలు ఢీకొని ముగ్గురు ప్రయాణికుల మృతి.. ఝార్ఖండ్‌ లో ఘోరం

అదే సమయంలో సంబంధిత ట్రాఫిక్‌ సిబ్బందిని సమస్య ఉన్న ప్రదేశానికి పంపించి.. పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటారు. అలాగే అసలు ట్రాఫిక్‌ స్తంభించడానికి గల కారణాలపై ప్రత్యేక దృష్టి పెడతారు. ఆ విధంగా ట్రాఫిక్ సమస్యలను వెనువెంటనే పరిష్కరిస్తారు.

ఆరోగ్య బీమా రంగంలోకి ఎల్‌ఐసీ అడుగుపెట్టబోతుందని వార్తలు.. ఇప్పటికైతే ప్రతిపాదనేదీ లేదన్న బీమా దిగ్గజం

వారం కిందటి నుంచే అందుబాటులోకి

సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు సొసైటీ ఫర్‌ సైబర్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ సహకారంతో ట్రాఫిక్‌ పర్యవేక్షణ కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈ డ్రోన్‌ కెమెరాలను వారం రోజుల కిందట అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ప్రయోగం సత్ఫలితాలిస్తున్నట్లు సైబరాబాద్‌ జాయింట్‌ కమిషనర్‌ (ట్రాఫిక్‌) జోయల్‌ డేవిస్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు.

ఇష్టంలేని ప్రేమ పెళ్లి చేసుకున్న కూతురికి తల్లిదండ్రుల షాక్.. ఆమె అత్తింటికి వెళ్లకుండా రోడ్డుకు అడ్డంగా గోడ కట్టిన వైనం.. కరీంనగర్ లో వింత ఘటన