![](https://test1.latestly.com/wp-content/uploads/2024/06/1-547386752-380x214.jpg)
Hyderabad, June 15: తమకు ఇష్టంలేనప్పటికీ, తనకు నచ్చిన విధంగా ప్రేమ పెళ్లి (Love Marriage) చేసుకున్న కూతురికి ఆ తల్లిదండ్రుల (Parents) బిగ్ షాక్ ఇచ్చారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ఎరడపల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఎరడపల్లి గ్రామంలో మమత అనే అమ్మాయి అదే గ్రామానికి చెందిన రత్నాకర్ ను ప్రేమించింది. అయితే, వీరి పెళ్లికి మమత తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినప్పటికీ, మమత వాళ్లను కాదని రత్నాకర్ ను ప్రేమ వివాహం చేసుకుంది. దీంతో మమతపై కోపం పెంచుకున్న ఆమె తల్లిదండ్రులు వింత నిర్ణయం తీసుకున్నారు.
కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందని ఇంటికి వెళ్లకుండా రోడ్డుకు అడ్డంగా గోడ కట్టిన కూతురు తల్లిదండ్రులు
కరీంనగర్ - శంకరపట్నం మండలం ఎరడపల్లి గ్రామంలో మమత అనే అమ్మాయి అదే గ్రామానికి చెందిన రత్నాకర్‌ను ప్రేమ పెళ్లి చేసుకుంది.. రత్నాకర్ ఇంటికి వెళ్లాలంటే మమత తల్లిదండ్రుల ఇల్లు దాటి… pic.twitter.com/hZUZqlDe5f
— Telugu Scribe (@TeluguScribe) June 15, 2024
రోడ్డుకు అడ్డంగా గోడ
మమత తన అత్తారిల్లు అంటే రత్నాకర్ ఇంటికి వెళ్లాలంటే.. తన పుట్టిల్లు మీదుగా రోడ్డు దాటి వెళ్ళాల్సి ఉంటుంది. ఇది తెలిసిన మమత తల్లిదండ్రులు.. ఆమె మీద కోపంతో రత్నాకర్ ఇంటికి అడ్డంగా రోడ్డుపై గోడ కట్టారు. దీంతో మమత దంపతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ పంచాయతీ పోలీసు స్టేషన్ కు చేరినట్టు సమాచారం.