Traffic Restrictions in Hyd: బీ అలర్ట్, హైదరాబాద్‌లో నేటి నుంచి 45 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు, ఈ రూట్లలో వెళ్లేవారు ఓ సారి చెక్ చేసుకోండి
ఈ సందర్భంగా ఆయా మార్గాలలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని నగర సీపీ కె.శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో 83వ అఖిలభారత పారిశ్రామిక పదర్శన (నుమాయిష్) జరగనుంది. ఈ సందర్భంగా ఆయా మార్గాలలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని నగర సీపీ కె.శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాబోయే 45 రోజుల పాటు ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని, ఈ విషయాన్ని ప్రజలు గమనించి ట్రాఫిక్ ఆంక్షలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
► ఎంజే మార్కెట్ నుంచి నాంపల్లి వైపు వెళ్లే ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు, ప్రైవేటు వాహనాలను ఎంజే మార్కెట్ చౌరస్తా నుంచి అబిడ్స్ వైపు మళ్లిస్తారు.
► బషీర్‌బాగ్, పోలీస్ కంట్రోల్‌రూమ్ వైపు నుంచి వెళ్లే భారీ, ఆర్టీసీ బస్సులను ఎల్బీస్టేడియం మీదుగా బీజేఆర్ విగ్రహం నుంచి అబిడ్స్ వైపు మళ్లిస్తారు.
► బేగంబజార్ ఛత్రి, మాలకుంట ప్రాంతాల నుంచి నాంపల్లి వైపు వచ్చే భారీ, మధ్యతరహా వాహనాలను దారుసలాం జంక్షన్ నుంచి ఏక్‌మినార్ వైపు మళ్లిస్తారు.
► బహదూర్‌పురా పాతబస్తీ నుంచి వచ్చే వాహనాలను సిటీ కాలేజ్ మీదుగా నయాపూల్ వైపు మళ్లిస్తారు.