నూతన సంవత్సర వేడుకల సందర్బంగా మద్యం అమ్మకాల్లో తెలంగాణ దుమ్మురేపింది. నిన్న ఒక్కరోజే 19 ప్రభుత్వ డిపోల నుంచి లక్ష 30 వేల కేసుల లిక్కర్, లక్ష 35 వేల కేసుల బీర్ అమ్మకాలు జరిగాయట. నిన్న ఒక్కరోజే ప్రభుత్వానికి రూ.125 కోట్ల ఆదాయం సమకూరిందట.ఈ సారి డిసెంబర్ 31 ఆదివారం కావడంతో మధ్యాహ్నం నుంచే వైన్స్‌ల వద్ద రద్దీ కనిపించింది. మూడు రోజుల్లో లిక్కర్ అమ్మకాలు ఆకాశాన్నంటాయి. డిసెంబర్ 29, 30, 31వ తేదీల్లో రూ.658 కోట్ల లిక్కర్ అమ్మకాలు జరిగినట్లు సమాచారం. మొత్తంగా 3 రోజుల్లో 4.76 లక్షల లిక్కర్ కేసులు... 6.31 లక్షల బీర్ కేసులు అమ్ముడయ్యాయి. వీడియో ఇదిగో, అర్థరాత్రి రెచ్చిపోయిన మందుబాబులు, పాతబస్తీలో పోలీసుల చెంపను పగలగొడుతూ హల్‌చల్
Here's News
తెగ తాగేశారు.. మూడు రోజుల్లోనే రూ.658 కోట్ల లిక్కర్ అమ్మకాలు
తెలంగాణలో డిసెంబర్ 31న లిక్కర్ సేల్స్ పెరిగాయి. మద్యం డిపోలను ఓపెన్‌లో పెట్టి మరీ లిక్కర్, బీర్లను వైన్ షాపులకు పంపారు. ఈ నెల 29, 30, 31వ తేదీల్లో ఏకంగా రూ.658 కోట్ల మేర లిక్కర్, బీర్లు అమ్ముడుపోయాయని అబ్కారీ శాఖ… pic.twitter.com/sNIk5FgXwZ
— Telugu Scribe (@TeluguScribe) January 1, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)