Traffic Restrictions in Hyderabad: హైదరాబాద్‌లో 24 గంటల పాటు ట్రాఫిక్ ఆంక్షలు, గణేష్ నిమజ్జనానికి ముస్తాబైన ట్యాంక్‌బండ్, ట్రాఫిక్‌ ఆంక్షల పూర్తి సమాచారం తెలుసుకుందాం

హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో బొజ్జ గణపయ్య నిమజ్జనోత్సవానికి (Ganesh idol immersion) సర్వం సన్నద్ధమైంది. ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వెల్లడించారు.

Hyderabad, Sep 17: హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో బొజ్జ గణపయ్య నిమజ్జనోత్సవానికి (Ganesh idol immersion) సర్వం సన్నద్ధమైంది. ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వెల్లడించారు. లక్షలాది మంది ఈ శోభాయాత్రలో పాల్గొంటారని, సుమారు 320 కిలోమీటర్ల మేర గణేష్‌ శోభాయాత్ర జరుగుతుందని, ఆయా రహదారులలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రహదారుల మరమ్మతులు చేపట్టవలసిన ప్రాంతాలను గుర్తించి వెంటనే చేయాలని, విగ్రహాలకు అడ్డంగా ఉండే విద్యుత్‌ తీగలు, చెట్ల కొమ్మలు తొలగించాలని సూచించారు.

ఈసారి వినాయక నిమజ్జనానికి భారీ బందోస్తు ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. వినాయక నిమజ్జానికి సిటీ పోలీస్ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.. హైదరాబాద్‌ వ్యాప్తంగా ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం వరకు ట్రాఫిక్​ ఆంక్షలు (Traffic Restrictions in Hyderabad) అమల్లో ఉంటాయని పోలీసులు ప్రకటించారు. ఇక, శనివారం అర్ధరాత్రి నుంచే నగరంలోని అంతర్రాష్ట్ర, జిల్లాల లారీల ప్రవేశంపై నిషేధం విధించారు.. ఆర్టీసీ బస్సులను సైతం పలుచోట్ల దారి మళ్లించారు.

శుక్రవారం ట్యాంక్‌ బండ్, ఎన్టీఆర్‌ మార్గ్‌లో చేపట్టిన ఏర్పాట్లను మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌ కుమార్, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్, కలెక్టర్‌ శర్మన్, వాటర్‌ వర్క్స్‌ అధికారి సత్యనారాయణ, వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులతో కలిసి మంత్రి పర్యవేక్షించారు. ట్యాంక్‌ బండ్‌పై ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిమజ్జనం ఏర్పాట్లను తెలియజేశారు.

హుస్సేన్ సాగర్‌లో పీఓపీ గణేష్ నిమజ్జనాలపై హైకోర్ట్ నిరాకరణ.. సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న తెలంగాణ ప్రభుత్వం, ఉన్నతస్థాయి సమీక్ష అనంతరం నిర్ణయించిన సీఎం

విమానాశ్రయం, రైల్వే స్టేషన్లకు వెళ్లే ప్రయాణికులు గణేష్ నిమజ్జన యాత్ర మీదుగా కాకుండా ప్రత్యామ్నయ దారుల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.. నగర ప్రజల కోసం కంట్రోల్ రూమ్‌ను కూడా ఏర్పాటు చేశారు.. వాహనాల దారి మల్లింపు, ట్రాఫిక్ ఆంక్షల గురించి తెలుసుకోవాలనుకుంటే.. 040-27852482, 94905 98985, 90103 03626 నెంబర్లకు సంప్రదించవచ్చునని పోలీసులు వెల్లడించారు.. ఇక, గూగుల్ మ్యాప్​లో ట్రాఫిక్ రద్దీపై ఎప్పటికప్పుడు అప్డేట్ చేసేలా ట్రాఫిక్ పోలీసులు ఏర్పాట్లు చేశారు.

ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరిగే విధంగా పటిష్టమైన పోలీసు బందోబస్తు నిర్వహించనున్నట్లు చెప్పారు. సుమారు 19 వేల మంది వివిధ స్థాయిలలో పోలీసు సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు. ప్రతి క్రేన్‌ వద్ద ఒక పోలీసు అధికారిని నియమించడంతో పాటు ప్రతి విగ్రహం వెంట నిమజ్జన యాత్రలో ఒక పోలీసు అధికారి ఉంటారు. నిమజ్జనం దృష్ట్యా వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు.

గణేష్‌ నిమజ్జన శోభాయాత్ర ఇలా..

బాలాపూర్ నుండి వచ్చే శోభాయాత్ర ఫలక్‌నుమా నుంచి వచ్చే శోభాయాత్ర.. చార్మినార్, అఫ్జల్​గంజ్, గౌలీగూడా చమాన్, ఎంజే మార్కెట్, అబిడ్స్, బషీర్‌బాగ్ మీదుగా ట్యాంక్ బండ్ లేదా ఎన్టీఆర్ మార్గ్‌కు విగ్రహాలు తరలించనున్నారు.

బేగం బజార్, ఉస్మాన్ గంజ్ , అఫ్జల్​గంజ్ గౌలిగూడా మీదుగా శోభాయాత్రకు వెళ్లే విధంగా ఏర్పాట్లు..

సికింద్రాబాద్ నుంచి వచ్చే శోభాయాత్ర ఆర్పీ రోడ్, కర్బాల మైదానం, కవాడిగుడ, ముషీరాబాద్ కూడలి, హిమయత్ నగర్ జంక్షన్, లిబర్టీ మీదుగా ట్యాంక్ బ్యాండ్ లేదా ఎన్టీఆర్‌ మార్గ్ వైపు విగ్రహాల మళ్లింపు.

ఉప్పల్ నుంచి వచ్చే శోభాయాత్ర రామాంతపూర్, అంబర్​పేట కూడలి, శివంరోడ్, ఫీవర్ ఆస్పత్రి, నారాయణగూడ కూడలి, లిబర్టీ మీదుగా కొనసాగేలా ఏర్పాట్లు.

దిల్‌సుఖ్​నగర్, ఐఎస్​సదన్ వైపు నుంచి వచ్చే శోభాయాత్ర సైదాబాద్, నల్గొండ క్రాస్ రోడ్, చాదర్ ఘాట్, ఎంజే మార్కెట్ మీదుగా ట్యాంక్‌బండ్‌కు..

టోలిచౌకి, రేతిబౌలి, మెహదీపట్నం నుంచి వచ్చే శోభాయాత్ర మాసబ్ ట్యాంక్, నిరంకారి భవన్ మీదుగా ఎన్టీఆర్‌ మార్గ్​ వైపు మళ్లింపు.

మెహిదీపట్నం, తపచ్ బుత్రా, ఆసిఫ్ నగర్ వైపు నుంచి వచ్చే శోభయాత్ర సీతారాంబాగ్, బోయగుడ కమాన్, గోశామహల్ బారదారి, ఎంజే మార్కెట్ మీదుగా ముందుకు వెళ్లనున్నాయి.

ఎర్రగడ్డ, ఎస్సార్ నగర్ నుంచి వచ్చే శోభాయాత్ర అమీర్​పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్​కు చేరుకోనుంది.

అయితే, ఈ రూట్ మ్యాప్ లో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లానని సూచిస్తున్నారు హైదరాబాద్‌ పోలీసులు.. ప్రతి శోభాయాత్ర మార్గంలో పోలీసులు అడుగడుగునా పర్యవేక్షించనున్నారు.. విగ్రహాలు తరలించే వాహనాలకు కలర్ కోడింగ్ బ్లూ అండ్ ఆరెంజ్ అండ్ రెడ్ అండ్ గ్రీన్ కేటాయించిన కలర్ ఆధారంగా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు ట్రాఫిక్ పోలీసులు..

ఎంఎంటీఎస్‌ స్పెషల్‌

ట్యాంక్‌బండ్‌కు తరలి వచ్చే భక్తుల రద్దీ దృష్ట్యా లింగంపల్లి– సికింద్రాబాద్, ఫలక్‌నుమా–సికింద్రాబాద్, లింగంపల్లి–నాంపల్లి రూట్లో ఎంఎంటీఎస్‌ ప్రత్యేక రైళ్లను నడుపనున్నారు. ఆదివారం రాత్రి 11 గంటల వరకు ప్రతి 3 నిమిషాలకు ఒకటి చొప్పున మెట్రో రైళ్లను అన్ని రూట్లలో నడుపనున్నట్లు అధికారులు తెలిపారు.

ప్రత్యేక బస్సులు..

నిమజ్జనం సందర్భంగా భారీగా తరలి రానున్న భక్తజనసందోహం కోసం గ్రేటర్‌ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. ఆదివారం ఉదయం నుంచి నిమజ్జన వేడుకలు పూర్తయ్యే వరకు 565 ప్రత్యేక బస్సులను నడిపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. బషీరాబాగ్‌ – కాచిగూడ, బషీర్‌బాగ్‌–రాంనగర్, ఓల్డ్‌ ఎమ్మెల్యేక్వార్టర్స్‌–దిల్‌సుఖ్‌నగనర్, ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌–ఎల్‌బీనగర్, ఓల్డ్‌ ఎమ్మెల్యేక్వార్టర్స్‌ – వనస్థలిపురం, మిధాని రూట్లలో బస్సులు రాకపోకలు సాగించనున్నాయి. ఉప్పల్‌– ఇందిరాపార్కు, మల్కాజిగిరి–ఇందిరాపార్కు, ఇందిరాపార్కు నుంచి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్, జామై ఉస్మానియా వరకు. లక్డీకాపూల్‌ నుంచి టోలీచౌకి,ఖైరతాబాద్‌ నుంచి బీహెచ్‌ఈఎల్‌వరకు, లకిడికాఫూల్‌ నుంచి కొండాపూర్, యూసుఫ్‌గూడ, రాజేంద్రనగర్‌ రూట్లలో ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. ఆల్‌ఇండియా రేడియో నుంచి కోఠీ, ఖైరతాబాద్‌ నుంచి జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, కూకట్‌పల్లి,బోరబండ, బాచుపల్లి,లింగంపల్లి, పటాన్‌చెరు. తదితర ప్రాంతాలకు బస్సులు రాకపోకలు సాగించనున్నాయి.

నిమజ్జన మార్గాల్లో మళ్లింపు..

పాతబస్తీ నుంచి హుస్సేన్‌సాగర్‌ వరకు కొనసాగనున్న నిమజ్జన శోభాయాత్ర దృష్ట్యా పాతబస్తీ మీదుగా రాకపోకలు సాగించే బస్సులను అఫ్జల్‌గంజ్‌ వరకే పరిమితం చేస్తారు. సికింద్రాబాద్‌ నుంచి ట్యాంక్‌బండ్‌ మీదుగా వెళ్లే బస్సులు ఇందిరాపార్కు వరకు పరిమితమవుతాయి. ఉప్పల్‌ నుంచి మెహదీపట్నం వైపు వెళ్లే బస్సులు కూడా ఇందిరాపార్కుకే పరిమితమవుతాయి. ప్రత్యేక బస్సులన్నింటికీ ‘గణేశ్‌ నిమజ్జనం స్పెషల్‌’ అనే డెస్టినేషన్‌ బోర్డులను ఏర్పాటు చేస్తారు. అర్ధరాత్రి తరువాత కూడా ఈ బస్సులు తిరుగుతాయి.

హెచ్‌ఎండీఏ..

హుస్సేన్‌సాగర్‌లోని విగ్రహాలు, పూజాసామాగ్రి తదితర వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించడంతోపాటు జీహెచ్‌ఎంసీ పారిశుధ్యవిభాగంతో సమన్వయంతో తరలిస్తుంది. ఈ పనుల కోసం వెయ్యిమంది సిబ్బంది విధుల్లో ఉంటారు. 101 ప్రాంతాల్లో తాగునీటి సదుపాయానికి జలమండలి ఏర్పాట్లు చేపట్టింది.

గణేశ్‌ యాత్రలో ఇంకా..

గణేశ్‌ శోభాయాత్ర మార్గంలో 38 ఫైర్‌ వాహనాలు ఉంచుతారు. సరూర్‌నగర్, కాప్రా, ప్రగతినగర్‌ చెరువుల వద్ద బోట్లు అందుబాటులో ఉన్నాయి. టూరిజం శాఖ ఆధ్వర్యంలో హుస్సేన్‌సాగర్‌ ట్యాంక్‌బండ్‌ వైపు 3 బోట్లు, నెక్లెస్‌రోడ్‌ వైపు 2 బోట్లు అందుబాటులో. వీటితోపాటు 4 స్పీడ్‌బోట్లు. 10 మంది గజ ఈతగాళ్లు అందుబాటులో ఉంటారు విద్యుత్‌ విభాగం ఆధ్వర్యంలో హుస్సేన్‌సాగర్‌ చుట్లూ 48 ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు. సరూర్‌నగర్‌ చెరువు వద్ద 5 ట్రాన్స్‌ఫార్మర్లు. వీటితో సహా వివిధ ప్రాంతాల్లో మొత్తం 101 ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు. జీహెచ్‌ఎంసీ పరిధిలో దాదాపు రూ. 1.52 కోట్లతో 41284 తాత్కాలిక లైటింగ్‌ ఏర్పాట్లు.

ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ (పీఓపీ)తో తయారుచేసిన గణేశ్‌ విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయడానికి సుప్రీంకోర్టు అనుమతించింది. అదికూడా ఈ ఏడాది నిమజ్జనానికే అను మతి ఇస్తున్నామని స్పష్టంచేసింది. హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జన వేడుకలకు ఇదే చివరి అవకాశమని, ఇది పునరావృతం కారాదని తేల్చిచెప్పింది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now