ACB Raids in Telangana: ప్రభుత్వం ఇచ్చే జీతాలు చాలక లంచాలకు అలవాటు, రూ. 84 వేలు తీసుకుంటూ అడ్డంగా ఏసీబీ అధికారులకు దొరికిన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌

ట్రైబ‌ల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా విధులు నిర్వ‌ర్తిస్తున్న కే జ‌గ జ్యోతి ఏసీబీ ధికారుల‌కు ప‌ట్టుబ‌డ్డారు. ఓ కాంట్రాక్ట‌ర్ నుంచి రూ. 84 వేలు లంచం తీసుకుంటుండ‌గా ఆమెను అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నారు

Tribal Welfare Executive Engineer Jaga Jyoti was caught taking bribe in Hyderabad (photo-Video Grab)

Hyd, Feb 20: మాస‌బ్‌ట్యాంక్‌లోని ట్రైబ‌ల్ వెల్ఫేర్ కార్యాల‌యంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వ‌హించారు. ట్రైబ‌ల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా విధులు నిర్వ‌ర్తిస్తున్న కే జ‌గ జ్యోతి ఏసీబీ ధికారుల‌కు ప‌ట్టుబ‌డ్డారు. ఓ కాంట్రాక్ట‌ర్ నుంచి రూ. 84 వేలు లంచం తీసుకుంటుండ‌గా ఆమెను అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నారు. అనంత‌రం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె కార్యాల‌యంతో పాటు ఇంట్లో సోదాలు నిర్వ‌హించారు. జ‌గ జ్యోతిని కోర్టులో హాజ‌రు ప‌రుస్తామ‌ని అధికారులు పేర్కొన్నారు.

రూ. 84 వేలు లంచం తీసుకుంటూ అధికారులకు అడ్డంగా దొరికిపోయిన మహిళా ఇంజినీర్.. ఆపై కన్నీళ్లపర్యంతం.. (వీడియో)

ఇటీవలే నల్గొండ ప్రభుత్వాస్పత్రిలో కూడా ఓ అధికారి ఏసీబీకి దొరికిపోయిన సంగతి విదితమే. కాంట్రాక్టర్ నుంచి రూ. 3 లక్షలను తీసుకుంటుండగా పట్టుకున్నారు.నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ గా బాధ్యతలు నిర్వరిస్తున్న డాక్టర్ లచ్చు నాయక్ ఔషధాల సరఫరా టెండర్‌ కోసం వెంకన్న అనే వ్యాపారి నుంచి రూ. 3 లక్షలను డిమాండ్ చేశాడు. టెండర్ కావాలంటే ప్రతిదానిలో 10 శాతం కమిషన్ కావాలని సూపరింటెండెంట్ డిమాండ్ చేయగా ఆ మేరకే మందులు సరఫరా చేస్తున్నట్లు వెంకన్న చెప్పాడు.

Here's Video

గత నవంబర్ నుంచి మరింత కమిషన్ కావాలని డిమాండ్ చేయడంతో డబ్బును ఇవ్వలేని వెంకన్న… అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు.వెంకన్న రూ. 3 లక్షలను లచ్చు నాయక్ కు ఇస్తుండగా… ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డబ్బును స్వాధీనం చేసుకోవటంతో పాటు సదరు అధికారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.



సంబంధిత వార్తలు

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్

One Nation, One Election: జమిలి ఎన్నికల బిల్లుపై ఓటింగ్‌, డుమ్మా కొట్టిన 20 మంది బీజేపీ ఎంపీలు, నోటీసులు జారీ చేసిన అధిష్టానం, సాధారణ మెజారిటీతో జేపీసీకి వన్‌ నేషన్, వన్‌ ఎలక్షన్‌ బిల్లు

Uttar Pradesh Horror: యూపీలో 5 ఏళ్ళ బాలుడిపై దారుణ అత్యాచారం, హత్య, వెను భాగం నుంచి తీవ్ర రక్తస్రావం, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

Hyderabad: నార్సింగిలో సోలార్ రూఫ్ టాప్ సైక్లింగ్ ట్రాక్‌ను తొలగించిన అధికారులు, బీఆర్ఎస్ ఆనవాళ్లను చెరిపేసే కక్ష సాధింపు చర్య అని మండిపడిన బీఆర్ఎస్