TRS MLA Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక మలుపు, సీపీ సీవీ ఆనంద్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం
ఈ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం (telangana-government) సిట్ ఏర్పాటు చేసింది. సీపీ సీవీ ఆనంద్ నేతృత్వంలో సిట్ (SIT) ఏర్పాటైంది.
Hyd, Nov 9: తెలంగాణలో సంచలనం రేపిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో (TRS MLA poaching case) కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం (telangana-government) సిట్ ఏర్పాటు చేసింది. సీపీ సీవీ ఆనంద్ నేతృత్వంలో సిట్ (SIT) ఏర్పాటైంది. సీట్ సభ్యులుగా నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరీ, డీసీపీ కల్‌మేశ్వర్, శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి, నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు, రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్, మొయినాబాద్ ఎస్‌హెచ్‌వో లక్ష్మీరెడ్డిలను నియమించింది.
కాగా ‘ఎమ్మెల్యేలకు ఎర’కేసులో బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ విచారణలో భాగంగా పోలీసుల దర్యాప్తుపై విధించిన స్టేను హైకోర్టు ఎత్తివేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేసుకోవచ్చంటూ స్పష్టం చేసింది. ఇలాంటి కేసుల్లో ఎక్కువ రోజులు దర్యాప్తు నిలిపివేయడం మంచిది కాదని వ్యాఖ్యానించింది. కేసుపై రాష్ట్ర, జాతీయ స్థాయి మీడియాల్లో విపరీత ప్రచారం జరిగిన దృష్ట్యా లోతైన విచారణ జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.