Telangana Assembly Session: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. సభలో మాకు ప్రత్యేకంగా సీటింగ్ ఏర్పాటు చేచేయాలన్న ‘ఆ’ ఎమ్మెల్యేలు.. ఎవరు వారు?

అయితే, శాసన సభలో తాము విడిగా కూర్చుంటామని, అందుకు తగినట్లుగా సీటింగ్ అరేంజ్‌మెంట్ చేయాలని స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్‌ కు పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు.

Telangana Assembly (Photo-IANS)

Hyderabad, July 23: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Session) నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (Ex CM KCR) ఈ సమావేశాలకు హాజరు అవుతారా? లేదా? అనే సస్పెన్స్ కొనసాగుతుంది. అది పక్కనపెడితే, శాసన సభలో తాము విడిగా కూర్చుంటామని, అందుకు తగినట్లుగా సీటింగ్ అరేంజ్‌మెంట్ చేయాలని స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్‌ కు పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఈ పదిమంది ఎమ్మెల్యేలు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే, అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలకు తాము సమదూరం పాటిస్తామని కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా పేర్కొన్నారు. సభలో తమకు విడిగా సీటింగ్ ఏర్పాటు చేయాలని స్పీకర్‌ ను కోరారు.

నేడు కేంద్ర బడ్జెట్‌.. 11 గంటలకు లోక్‌ సభ లో ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్

అప్పట్లో కూడా..

గతంలో టీడీపీ నుంచి గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న వీళ్లు రెండు పార్టీలతో సంబంధం లేకుండా విడిగా కూర్చున్నారు. శ్రీధర్ బాబు స్పీకర్‌ గా ఉన్న సమయంలో ఇది జరిగింది. ఆ ఆనవాయితీనే ఇప్పుడు కూడా ఎమ్మెల్యేలు ఫాలో అవుతున్నట్టు తెలుస్తున్నది.

భార్యతో భర్త అసహజ శృంగారం చేయడం అత్యాచారం కిందకు రాదు, భార్య పిటిషన్ కొట్టేసిన ఉత్తరాఖండ్ హైకోర్టు



సంబంధిత వార్తలు

Telangana: ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దే వద్దు..దిలావర్‌పూర్‌లో రైతుల ఆందోళన,ఆర్డీవో కారు ధ్వసం, రైతుల అరెస్ట్..పరిస్థితి ఉద్రిక్తం

CM Revanth Reddy: తెలంగాణలో మూడు కొత్త ఎయిర్ పోర్టులపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి, వరంగల్ మానాశ్రయ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని కేంద్రమంత్రిని కోరిన తెలంగాణ సీఎం

KTR: రాహుల్ గాంధీ తిట్టడంతోనే వెనక్కి తగ్గిన రేవంత్ రెడ్డి...అబద్దాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కేటీఆర్ ఫైర్, చిట్టినాయుడు చిప్ దొబ్బిందని ఎద్దేవా చేసిన కేటీఆర్

Harishrao: వాంకిడి బాధితులను పరామర్శించడం తప్పా?, రాజ్యాంగ దినోత్సవం రోజే హక్కుల ఉల్లంఘనా?...సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్