TS Budget Session 2022: రాష్ట్ర అప్పులు రూ. 3.30 లక్షల కోట్లు, పన్ను ఆదాయం రూ. 1,08,212 కోట్లు, రూ.2.56 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి హరీష్ రావు

ఇది బడుగుల జీవితాలను మార్చే బడ్జెట్ అని చెప్పారు. ముమ్మాటికీ కేసీఆర్ మార్క్ బడ్జెట్ అని తెలిపారు. రూ.2.56 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్‌‌ను (Rs 2.56 lakh crore budget 2022-23) రూపొందించారు. తెలంగాణ దేశంలో అగ్రగామిగా రూపుదాల్చిందని మంత్రి తెలిపారు.

Minister Harish Rao (Photo-Video Grab)

Hyd, Mar 7: 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ప్రజల ఆకాంక్షల మేరకు బడ్జెట్ ను (TS Budget Session 2022) రూపొందించామని ఈ సందర్భంగా ఆయన (Minister Harish Rao) అన్నారు. ఇది బడుగుల జీవితాలను మార్చే బడ్జెట్ అని చెప్పారు. ముమ్మాటికీ కేసీఆర్ మార్క్ బడ్జెట్ అని తెలిపారు. రూ.2.56 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్‌‌ను (Rs 2.56 lakh crore budget 2022-23) రూపొందించారు. తెలంగాణ దేశంలో అగ్రగామిగా రూపుదాల్చిందని మంత్రి తెలిపారు.

పారదర్శక విధానాలతో రాబడిని పెంచుకున్నామన్నారు. సమైక్యరాష్ట్రంలో తెలంగాణ అగచాట్లు పడిందని గుర్తుచేశారు. పోరాటం దశ నుంచి ఆవిర్భావం వరకూ తెలంగాణ కొత్తరూపం సంతరించుకుందని తెలిపారు. సవాళ్లు, క్లిష్టమమైన సమస్యలను అధిగమించామని చెప్పారు. పరిపాలనలో టీఆర్‌ఎస్‌ రాజీలేని వైఖరిని అవలంభించిందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు విద్యుత్‌ కోతలు, ఆకలి చావులు లేవన్నారు. దేశంలో తెలంగాణ ఓ టార్చ్‌ బేరర్‌ అని తెలిపారు. ఆసరా, రైతు బంధు ఇలా ఏ పథకమైనా లబ్ధిదారులకే చేరుతుందని అన్నారు. ప్రగతిశీల రాష్ట్రాలను కేంద్రం నిరుత్సాహపరుస్తోందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచే కేంద్రం దాడి మొదలైందన్నారు. ఏడు మండలాలను ఏపీకి అక్రమంగా బదలాయించిందని మంత్రి హరీష్‌రావు విమర్శించారు.

అసెంబ్లీ నుంచి ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు సస్పెండ్, శాస‌న‌స‌భ స‌మావేశాలు ముగిసే వ‌ర‌కు ఈ ముగ్గురిని స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు ప్రకటించిన స్పీకర్

వ్యవసాయ రంగానికి గత ఏడేళ్లుగా ప్రభుత్వం పెద్ద ఎత్తున బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తోంది. గత ఎనిమిది వ్యవసాయ సీజన్లలో రైతు బంధు పథకం కింద 50,448 కోట్ల రూపాయలను 63 లక్షల మంది రైతుల ఖాతాలో ప్రభుత్వం జమ చేసింది. రైతు భీమా పథకం ద్వారా రైతు మరణిస్తే వారి కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నాం. ఇలా ఇప్పటి వరకు 75 వేల కుటుంబాలకు 3,775 కోట్ల రూపాయలను ప్రభుత్వం అందజేసింది. ఇలా రైత సంక్షేమం కోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నాం. ఈ వార్షిక బడ్జెట్లో వ్యవసాయ రంగానికి మొత్తంగా 24254 కోట్ల రూపాయలు కేటాయించాం. గతంలో హామీ ఇచ్చినట్టుగా ఈ ఏడాది 75 వేల లోపు రుణాలను కూడా మాఫీ చేయాలని నిర్ణయించింది.

2022-23 సంవత్సరంలో బడ్జెట్లో పామాయిల్ సాగును ఎక్కువగా ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2.5 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందు కోసం ఈ ఏడాది బడ్జెట్‌లో 1000 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 61 మార్చురీల ఆధునీకరణకు 32 కోట్ల 50 లక్షల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసింది (ఇప్పటికే మంజూరు చేయడం జరిగింది).

తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగం, కేసీఆర్‌కు సీఎం పదవిలో కొనసాగే హక్కు లేదు, అసెంబ్లీలో ముగ్గురమే ఉన్నా ప్రజలంతా మా వైపే, ప్రభుత్వంపై మండిపడిన బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్

పారిశుధ్యకార్మికులకు, ఇతర సిబ్బందికి వేతనాలు పెంచాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బడ్జెట్‌లో ప్రభుత్వం బెడ్ ఒక్కంటికి చేసే పారిశుద్ద్య ఖర్చును 5000 నుంచి 7500 రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందు కోసం ప్రభుత్వం రూ. 338 కోట్లను ప్రతి సంవత్సరం వెచ్చించనుంది. హైదరాబాద్‌ లోని 18 మేజర్‌ ప్రభుత్వ హాస్పటళ్లలో రోగితో ఉండే సహాయకులకు కూడా సబ్సిడీపై భోజన సదుపాయం కల్పించాలని ఈ బడ్జెట్లో నిర్ణయించడం జరిగింది. రెండు పూటలా వారికి ఈ భోజనం అందుతుంది. ప్రతీ రోజు సుమారు 18,600 మందికి ఈ ప్రయోజనం కలుగుతుందని అంచనావేస్తోంది. దీని కోసం సంవత్సరానికి 38.66 కోట్లు ఖర్చవుతాయి.

ద‌ళిత బంధు ప‌థ‌కానికి ఈ ఏడాది ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఇచ్చిన హామీ మేర‌కు నిధుల‌ను భారీగా పెంచారు. గ‌త వార్షిక బ‌డ్జెట్‌లో వెయ్యి కోట్ల‌ను కేటాయించ‌గా ఈసారి ఏకంగా వార్షిక బడ్జెట్లో దళిత బంధు పథకం కోసం రూ. 17,700 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. దళిత బంధు పథకాన్ని హుజురాబాద్‌ నియోజకవర్గంతో పాటు చింతకాని, తిరుమలగిరి, నిజాంసాగర్‌, చారగొండ మండలాల్లో ప్రభుత్వం ఇప్పటికే సంపూర్ణంగా అమలు చేస్తోంది. దాంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి వందమంది చొప్పున మొత్తం 118 నియోజకవర్గాల్లో 11వేల 800 కుటుంబాలకు దళితబంధు పథకం కింద ఆర్థికసహాయం అందిస్తున్నది. వచ్చే సంవత్సరాంతానికి రెండు లక్షల మందికి లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం బడ్జెట్లో రూ.17,700 కోట్లు కేటాయించడం జరిగింది.

బడ్జెట్ ప్రసంగంలోని హైలైట్స్:

రూ.2.56 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్‌

2022-23 నాటికి రాష్ట్ర అప్పులు రూ. 3,29,998 కోట్లు

పన్ను ఆదాయం రూ. 1,08,212 కోట్లు

కేంద్ర పన్నుల్లో వాటా రూ. 18,394 కోట్లు

పన్నేతర ఆదాయం రూ. 25,421 కోట్లు

గ్రాంట్లు - రూ. 41,001 కోట్లు

రెవెన్యూ వ్యయం రూ.1.89 లక్షల కోట్లు

క్యాపిటల్‌ వ్యయం రూ.29,728 కోట్లు

దళిత బంధుకు రూ. 17,700 కోట్లు

అమ్మకం పన్ను అంచనా రూ. 33 వేల కోట్లు

ఎక్సైజ్ ద్వారా ఆదాయం రూ. 17,500 కోట్లు

స్టాంపులు, రిజిస్ట్రేషన్ ద్వారా ఆదాయం రూ. 15,600 కోట్లు

ముఖ్యమంత్రి పరిధిలో నిర్వాసితులు, ప్రమాద బాధితులకు ఇళ్ల కేటాయింపు

యాదాద్రి తరహాలో పుణ్యక్షేత్రాల అభివృద్ధి

పల్లె ప్రగతి ప్రణాళికకు రూ. 330 కోట్లు

అటవీ విశ్వవిద్యాలయానికి రూ. 100 కోట్లు

సొంత స్థలంలో రెండు పడకల ఇళ్ల నిర్మాణానికి రూ. 3 లక్షల చొప్పున ఆర్థిక సాయం. 4 లక్షల మందికి సాయం. ప్రతి నియోజకవర్గంలో 3 వేల ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం.

గిరిజన గ్రామ పంచాయతీల భవనాల నిర్మాణాలకు రూ. 600 కోట్లు

హెచ్ఎండీఏ పరిధిలో మరో 94 బస్తీ దవాఖానాలు

కిడ్నీ రోగులకు 42 ఉచిత డయాలసిస్ కేంద్రాలు

వరంగల్ లో హెల్త్ సిటీ

ఆరోగ్యశ్రీ పరిమితి రూ. 5 లక్షలకు పెంపు

అవయవ మార్పిడి చికిత్సలకు ఆరోగ్యశ్రీ ద్వారా రూ. 10 లక్షలు

ఆక్సిజన్ ఉత్పత్తిని రోజుకు 135 నుంచి 550 టన్నులకు పెంపు

రాష్ట్రంలో 84 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు అందజేత

రాష్ట్రంలో ప్రస్తుత విద్యుత్ సామర్థ్యం 17,305 మెగావాట్లు

గ్రామ పంచాయితీలకు ప్రతినెలా రూ. 227.5 కోట్లు

పట్టణ ప్రగతికి రూ. 1394 కోట్లు

మన ఊరు, మన బడి కోసం రూ. 3497 కోట్లు

కొత్త మెడికల్‌ కాలేజీలకు రూ.వెయ్యి కోట్లు

అటవీ యూనివర్సిటీకి రూ.100 కోట్లు

పామాయిల్‌ సాగుకు రూ.వెయ్యి కోట్లు

వ్యవసాయ రంగానికి రూ.24,254 కోట్లు

హరితహారానికి రూ.932 కోట్లు

డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం కోసం రూ. 12 వేల కోట్లు

ఎస్సీ, ఎస్టీ సంక్షేమం కోసం రూ. 12565 కోట్లు

రోడ్లు భవనాల శాఖకి రూ.1542 కోట్లు, పర్యాటక రంగానికి 1500 కోట్లు

తెలంగాణ పోలీస్ శాఖకి రూ. 9315 కోట్లు

ఇరిగేషన్‌ శాఖకు రూ. 22675 కోట్లు, అసరాకు రూ.11728 కోట్లు

కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌కు రూ.2750 కోట్లు

గిరిజన సంక్షేమానికి రూ.12,565 కోట్లు, బీసీ సంక్షేమ శాఖకు రూ. 5698 కోట్లు

బ్రాహ్మణ సంక్షేమం కోసం రూ. 117 కోట్లు కేటాయింపు

మెదక్‌, మేడ్చల్‌, రంగారెడ్డి, ములుగు, నారాయణపేట, గద్వాల్‌,యాదాద్రిలో మెడికల్‌ కాలేజీలు

రూ.50 వేల లోపు రైతు రుణాలు మార్చిలోపు మాఫీ

వచ్చే ఆర్థిక ఏడాది రూ.75 వేల లోపు సాగు రుణాలు మాఫీ

సొంత స్థలాల్లో ఇళ్లు నిర్మాణానికి రూ.3 లక్షల ఆర్థికసాయం

రాష్ట్రంలో పామాయిల్‌ సాగుకు ప్రోత్సాహం

నియోజకవర్గానికి 3 వేల ఇళ్లు కేటాయింపు

ఎమ్మెల్యేల పరిధిలో 3.57 లక్షల ఇళ్లు

నిర్వాసితులు, ప్రమాద బాధితులకు 43 వేల ఇళ్లు

రాబోయే రెండేళ్లలో అన్ని జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు

యాదాద్రి తరహాలో పుణ్యక్షేత్రాల అభివృద్ధి

హెచ్‌ఎండీఏ పరిధిలో మరో 94 బస్తీ దవాఖానాలు

బస్తీ దవాఖాలను 15వ ఆర్థిక సంఘం ప్రశంసించింది

కిడ్నీ రోగులకు 42 ఉచిత డయాలసిస్‌ కేంద్రాలు

ఆరోగ్యశ్రీ పరిమితి రూ. 5 లక్షలకు పెంపు, వరంగల్‌లో హెల్త్‌ సిటీ

అవయవమార్పిడి చికిత్సలకు ఆరోగ్యశ్రీ ద్వారా రూ. 10 లక్షలు

ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల్లో దేశంలోనే తెలంగాణ నెంబర్‌ వన్‌

ఆక్సిజన్‌ ఉత్పత్తిని రోజుకు 135 నుంచి 550 టన్నులకు పెంచాం

వైరస్‌ వ్యాప్తి కట్టడిలో తెలంగాణ మూడో స్థానంలో ఉంది

తెలంగాణలో ఊహకందని రీతిలో పంటల దిగుబడి ఉంది

ఐక్యరాజ్యసమితి కూడా రైతు బంధును అభినందించింది

వ్యవసాయ వృద్ధిరేటు 4 శాతం నుంచి 29 శాతానికి పెరిగింది

తెలంగాణ పత్తికి అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది

3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు ఆందోళన చేశారు

రుణాలు రూ.25,970 కోట్లు, అమ్మకం పన్ను అంచనా రూ.33 వేల కోట్లు

ఎక్సైజ్‌ ఆదాయం రూ.17,500 కోట్లు

స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం రూ.15,600 కోట్లు

ఇది ముమ్మాటికీ సీఎం కేసీఆర్‌ మార్క్‌ బడ్జెట్‌

2021-22 నాటికి రాష్ట్ర జీఎస్‌డీపీ రూ.11,54,860 కోట్లు

2015-16 నుంచి రాష్ట్ర జీఎస్‌డీపీ జాతీయ సగటు కంటే ఎక్కువ

2015-16 నంచి 2020-21 మధ్య సగటున 11.7 శాతం ఆర్థిక వృద్ధి

ఆర్థిక వృద్ధిలో దక్షిణాది రాష్ట్రాల్లోనే తెలంగాణ అగ్రగామి

తెలంగాణ జీఎస్‌డీపీ వృద్ధిరేటు 11.1 శాతంగా అంచనా

దేశ జీడీపీ వృద్ధి రేటు 19.14 శాతంగా అంచనా

తెలంగాణలో 84 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు

పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ.18,500 కోట్లు ఖర్చుచేశాం

నమ్మక్క- సారక్క బ్యారేజీ ప్రారంభానికి సిద్ధంగా ఉంది

గోదావరి ప్రాజెక్టుల డీపీఆర్‌లను సమర్పించి 5 నెలలైనా...

కేంద్రం ఇప్పటికి క్లియరెన్స్‌ ఇవ్వలేదు

తెలంగాణలో ఏ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు

కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా ఇంకా తేల్చలేదు

అర్బన్ మిషన్ భగీరథకు ఈ బడ్జెట్‌లో రూ. 800 కోట్లు కేటాయింపు

కాళేశ్వరం టూరిజం సర్య్యూట్‌కు రూ. 750 కోట్లు

ఎయిర్ పోర్టు మెట్రో కనెక్టవిటీకి ఈ బడ్జెట్‌లో రూ. 500 కోట్లు

హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకు మరో రూ. 1500 కోట్లు కేటాయింపు

పరిశ్రమలకు ప్రోత్సాహకాలుగా రూ. 2142 కోట్లు,

పరిశ్రమలకు విద్యుత్ రాయితీ కింద రూ. 190 కోట్లు

హైదరాబాద్ మెట్రో పరిధిలో రోజుకు 20 లీటర్ల ఉచితంగా నీరందించే పథకానికి రూ. 300 కోట్లు కేటాయింపు.

ఆర్టీసీని బలోపేతం చేసేందుకు రూ. 1500 కోట్లు కేటాయింపు.

గిరిజన, ఆదివాసీ గ్రామ పంచాయతీలకు సొంత భవనాల నిర్మాణాలకు 600 కోట్ల రూపాయలు కేటాయింపు

ఎస్టీ నివాస ప్రాంతాలకు రోడ్ల నిర్మాణం కోసం ఎస్టీఎస్డీఎఫ్ నిధుల నుంచి 1000 కోట్లు

మెట్రో రైలును పాతబస్తీలో 5.5 కిలోమీటర్లకు అనుసంధానించేందుకు ఈ బడ్జెట్‌లో రూ.500 కోట్లు

రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, నిర్వహణ కోసం రూ. 1542 కోట్లు

దూప దీప నైవేద్య పథకానికి రూ. 12.50 కోట్లు, 1736 దేవాలయాలు కొత్తగా ఈ పథకంలో..

మున్సిపాలిటీల్లో నీటి కొరతను శాశ్వతంగా తీర్చేందుకు రూ.1200 కోట్లు

గీత కార్మికుల సంక్షేమం కోసం 100 కోట్లు

గొల్ల కురుమల సంక్షేమం కోసం 1000 కోట్ల రూపాయలు కేటాయింపు

డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం కోసం 12000 కోట్ల రూపాయలు

ఆసరా ఫించన్ల కోసం 2022-2023 వార్షిక బడ్జెట్‌లో 11728 కోట్లు

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement