![](https://test1.latestly.com/wp-content/uploads/2021/11/Pocharam-Srinivas-Reddy.jpg)
Hyd, Mar 7: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో (TS Budget Session 2022) గవర్నర్ ప్రసంగం లేకుండానే ప్రారంభం కావడం గమనార్హం. ప్రారంభం అయిన వెంటనే తెలంగాణ శాసనసభ నుంచి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ (BJP MLAs suspended) చేశారు. బడ్జెట్ ప్రసంగానికి అడ్డుపడుతున్న ఈటల రాజేందర్, రాజా సింగ్, రఘునందన్ రావును సస్పెండ్ చేశారు. శాసనసభ సమావేశాలు ముగిసే వరకు ఈ ముగ్గురిని సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
2022-23 వార్షిక బడ్జెట్‌ను శాసనసభలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టారు. రూ. 2,56,958.51 కోట్లతో హరీశ్‌రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ. 1.89 లక్షల కోట్లు కాగా, క్యాపిటల్ వ్యయం రూ. 29,728 కోట్లు. రాష్ట్రం ఆవిర్భవించిన అనతికాలంలో అద్భుత ప్రగతి సాధించామని హరీశ్‌రావు తెలిపారు. సీఎం ప్రజల నమ్మకాన్ని నిలబెడుతూ ప్రగతి పథంలో రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నారు. పరిపాలనలో రాజీలేని వైఖరిని టీఆర్ఎస్ అవలంభించింది. కరెంట్ కోతలు, ఆకలి చావులు ఇప్పుడు లేవు అని స్పష్టం చేశారు.తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆర్థికమంత్రి హరీష్‌రావు ప్రసంగిస్తున్నారు.