TS-BPAS Customer Charges: టీఎస్‌–బీపాస్‌ కస్టమర్ ఛార్జీలు ఖరారు, ఆన్‌లైన్‌ ద్వారా రుసుం చెల్లించాలి, 75 చదరపు గజాలలోపు ఉంటే అనుమతి ఉచితం

భవన/లే–అవుట్‌లకు అనుమతుల కోసం వసూలు చేసే వివిధ రకాల ఫీజులు, చార్జీలకు కస్టమర్‌ చార్జీలు అదనం కానున్నాయి.

TS-BPAS logo ( Photo-File Image)

Hyd, Nov 19: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీఎస్‌–బీపాస్‌ దరఖాస్తుదారుల నుంచి వసూలు చేయాల్సిన కస్టమర్‌ చార్జీలను (TS-BPAS Customer Charges) ఖరారు చేసింది. భవన/లే–అవుట్‌లకు అనుమతుల కోసం వసూలు చేసే వివిధ రకాల ఫీజులు, చార్జీలకు కస్టమర్‌ చార్జీలు అదనం కానున్నాయి. దరఖాస్తు సమయంలో ఆన్‌లైన్‌ ద్వారా ఈ రుసుంను చెల్లించాల్సి ఉంటుంది. ప్లాట్‌ విస్తీర్ణం ఆధారంగా వినియోగదారుల (TS-BPAS Applicants) రుసుంను లెక్కించి వసూలు చేయనున్నారు. ప్లాట్‌ విస్తీర్ణం 500 చదరపు మీటర్లకు మించితే విస్తీర్ణం ఆధారంగా మొత్తం పర్మిషన్‌ ఫీజులో 1 శాతం నుంచి 2.50 శాతం వరకు కస్టమర్‌ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

75 చదరపు గజాలలోపు ఉంటే ఉచితంగా అనుమతి ఇవ్వబడుతుంది. 75 చదరపు గజాల నుంచి 200 చదరపు మీటర్లలోపు ఉంటే రూ.500 రుసుంగా వసూలు చేస్తారు. 200–500 చ.మీ లోపు ఉంటే రూ.1000 రుసుం, 500–1000 చ.మీ ఉంటే మొత్తం రుసుంలో 1% గా వసూలు చేస్తారు. ఇక 1,000 – 2,000 చ.మీ ఉంటే మొత్తం రుసుంలో 2%గా.. 6. 2 వేల చ.మీ.కు పైన ఉంటే మొత్తం రుసుంలో 2.5%గా వసూలు చేస్తారు.

 టిఎస్‌-బీపాస్ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్, భవన నిర్మాణానికి 21 రోజుల్లో అనుమతులు వచ్చేలా చర్యలు, రియల్‌​ ఎస్టేట్‌ ధరలు పెంచవద్దని మంత్రి హెచ్చరిక

టీఎస్‌–బీపాస్‌ వెబ్ సైట్ లాంచ్ సంధర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. అనుమతి కాగితమే ఆయుధమని, 600 చదరపు గజాలలోపు ఉన్న స్థలాలు ఉన్న వారికి స్వీయ ధ్రువీకరణ ద్వారా అనుమతి ఇస్తామని తెలిపారు. 600 గజాలపైన ఉన్న వారికి 21 రోజుల్లో అనుమతులు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif