Telangana High Court: అగ్రిగోల్డ్, అక్షయ గోల్డ్ కేసుల్లో కీలక మలుపు, రెండు కేసుల వివాదాలను ఏలూరు కోర్టుకు బదిలీ చేసిన తెలంగాణ హైకోర్టు
అగ్రిగోల్డ్, అక్షయ గోల్డ్ కేసుల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్ కేసులను ఏపీలోని ఏలూరు కోర్టుకు బదిలీ చేస్తూ తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
Hyd, Feb 25: అగ్రిగోల్డ్, అక్షయ గోల్డ్ కేసుల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్ కేసులను ఏపీలోని ఏలూరు కోర్టుకు బదిలీ చేస్తూ తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఏడేళ్లుగా హైకోర్టులో అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్ వివాదాలు కొనసాగుతుండగా, వాటిని ఏలూరు కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది. కాగా, హైకోర్టులోనే విచారణ కొనసాగించాలన్న డిపాజిటర్ల, బ్యాంకుల అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది.
అదే సమయంలో వేలం ద్వారా వచ్చిన రూ. 50 కోట్లను కూడా ఏలూరు కోర్టుకే బదిలీ చేసింది. ఈ మేరకు హైకోర్టు ఆదేశాలను పరిగణలోకి తీసుకోవాలని ఏలూరు కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. ఏపీ డిపాజిటర్ల రక్షణ చట్టం ప్రకారం ఏలూరు కోర్టుకే విచారణాధికారం ఉందని హైకోర్టు పేర్కొంది. ఈ రెండు వివాదాల్లో కేసులన్నింటిపై విచారణను ముగిసింది.
Advertisement
సంబంధిత వార్తలు
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Gold Prices Hike: బంగారం ధర పెరగడమే కానీ తగ్గేదే లేదు! రాబోయే రోజుల్లో రికార్డుస్థాయికి గోల్డ్ రేటు చేరుతుందంటున్న నిపుణులు
PDS Rice Scam Case: రేషన్ బియ్యం కేసులో పేర్ని నానికి ముందస్తు బెయిల్, కాకినాడ సీ పోర్టు వ్యవహారంలో విక్రాంత్ రెడ్డి కూడా ముందస్తు బెయిల్
Pune Court: నుదుటన బొట్టు లేదు.. మెడలో మంగళసూత్రం లేదు.. ఇలా అయితే, నీ భర్త నీపై ఎందుకు ఆసక్తి చూపుతాడు? మహిళకు జడ్జి ప్రశ్న.. అసలేం జరిగింది??
Advertisement
Advertisement
Advertisement