COVID in TS: కొంతకాలం తర్వాత సాధారణ జలుబు స్థాయికి కోవిడ్19; తెలంగాణలో కొత్తగా 729 కరోనా కేసులు నమోదు; గడిచిన ఒక్కరోజులో మరో 987 మంది కరోనా నుంచి రికవరీ
అన్ని రకాల వైరస్‌లు కాలక్రమేణా మ్యుటేషన్లు చెందడం సాధారణమేనని, ప్రస్తుతం మహమ్మారిగా పిలుచుకుంటున్న కరోనావైరస్ కూడా కొంతకాలం నాటికి ఇన్ల్ఫుఎంజా లాంటి జలుబు స్థితికి చేరుకుంటుందని...
Hyderabad, June 9: కరోనావైరస్ కొంతకాలం తర్వాత దానంతటదే కనుమరుగవుతుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) నిపుణులు వెల్లడించారు. ఐసీఎంఆర్ లోని ఎపిడెమియాలజీ అండ్ కమ్యూనికేషన్ డిసీజెస్ విభాగం హెడ్ సమీరన్ పాండా మాట్లాడుతూ అన్ని రకాల వైరస్‌లు కాలక్రమేణా మ్యుటేషన్లు చెందడం సాధారణమేనని, ప్రస్తుతం మహమ్మారిగా పిలుచుకుంటున్న కరోనావైరస్ కూడా కొంతకాలం నాటికి ఇన్ల్ఫుఎంజా లాంటి జలుబు స్థితికి చేరుకుంటుంది.. అని 'పాండమిక్ నుంచి ఎండమిక్ స్టేజికి చేరుకుంటుంది' ఆయన అన్నారు. ఆ తర్వాత కేవలం రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే కొద్ది మందికి మాత్రమే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది తప్ప మిగతా వారికి ఎలాంటి వ్యాక్సిన్ అవసరం ఉండబోదని సమీరన్ పాండా అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం తెలంగాణలో గల కోవిడ్ కేసులను పరిశీలిస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,06,045 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 729 మందికి పాజిటివ్ అని తేలింది. ఇంకా 1,135 మంది శాంపుల్స్‌కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 6,30,514కి చేరుకుంది. ఈరోజు వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 72 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, ఖమ్మం నుంచి 72, నల్గొండ నుంచి 59 మరియు వరంగల్ అర్బన్ నుంచి 51 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
Telangana's COVID19 Bulletin:
నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 31 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.
గడిచిన 24 గంటల్లో మరో 6 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 3,720కు పెరిగింది.
అలాగే సాయంత్రం వరకు మరో 987 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 6,15,852 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 10,942 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.