Yellow Alert For Telangana: తెలంగాణపై మోచి తుఫాన్ ఎఫెక్ట్, ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ, ఏయే జిల్లాల్లో భారీ వర్షాలంటే?
ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వనపర్తి అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.
Hyderabad, May 07: తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (Meteorological Department) తెలిపింది. ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ను (Yellow Alert) జారీ చేసింది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెడల్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్ వనపర్తి అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.
సోమవారం నుంచి మంగళవారం వరకు ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, యదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో ఉరుము, మెరుపులతో వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. అలాగే ఈ నెల 9 నుంచి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 40 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని వివరించింది.