TSRTC Free Ticket Row: సీఎం రేవంత్ ‘ఫ్రీ టిక్కెట్టు’ ఆదేశాల్ని ధిక్కరించిన కండక్టర్? నిజామాబాద్ లో మహిళలకు టిక్కెట్టు ఇచ్చినట్టు వీడియో వైరల్, అసలు విషయం ఏంటంటే..
అయితే ఈ స్కీం అమల్లో ఉండగా మహిళలకు టిక్కెట్లు జారీ చేసిన ఓ కండక్టర్ ఉదంతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.
Hyderabad, Dec 11: ఎన్నికల మ్యానిఫెస్టోలో (Election Manifesto) ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో (Telangana) మహిళలకు ఆర్టీసీలో (RTC) ఉచిత ప్రయాణ పథకాన్ని కాంగ్రెస్ సర్కారు (Congress Government) తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ స్కీం అమల్లో ఉండగా మహిళలకు టిక్కెట్లు జారీ చేసిన ఓ కండక్టర్ ఉదంతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే, నిజామాబాద్ నుంచి బోధన్ వెళ్తున్న పల్లె వెలుగు బస్సులో నిజామాబాద్ టౌన్ బస్టాండ్ వద్ద ఆదివారం ఒక పురుషుడు, ఇద్దరు మహిళలు ఎక్కారు. టిక్కెట్లు ఇవ్వమని పురుష ప్రయాణికుడు అడిగితే కండక్టర్ మూడు టిక్కెట్లను ఒక్కోటి రూ.30కి ఇచ్చారు. అయితే, రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉందని ప్రయాణికుడు కండక్టర్ తో చెప్పారు. అప్పటికే, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్ గా మారింది. కండక్టర్ ప్రభుత్వ ఆదేశాలు ధిక్కరిస్తూ మహిళలకు టిక్కెట్లు జారీ చేశారన్న ప్రచారం జరిగింది.
TS Govt: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం, ఏకంగా 54 మంది నియామకాలు రద్దు చేస్తూ ఉత్తర్వులు
తర్వాత ఏం జరిగింది?
ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెంటనే స్పందించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న కండక్టర్ ను డిపో స్పేర్ లో ఉంచి విచారణ చేపట్టారు. అనంతరం, కండక్టర్ ఉద్దేశపూర్వకంగా ఈ చర్యకు పాల్పడలేదంటూ వివరణ ఇచ్చారు. ఎప్పుడైతే, పురుష ప్యాసింజర్ తనతో ఉన్నది ఇద్దరు మహిళలు అని చెప్పగానే, పొరపాటు జరిగిందని అప్పుడే కండక్టర్ చెప్పినట్టు వివరించారు. ముగ్గురూ పురుష ప్రయాణికులే అని అనుకుని 3 టిక్కెట్లు ఇచ్చానని అతను చెప్పినట్టు తెలిపారు. ఆ తరువాత కండక్టర్ మహిళల రెండు టిక్కెట్ల డబ్బునూ వెనక్కు ఇచ్చేశాడని, అప్పటికే, వీడియో వైరల్ గా మారిందని చెప్పారు. మహాలక్ష్మి పేరిట ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకంపై ఆర్టీసీ సిబ్బందికి అవగాహన కల్పించామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు.