TSRTC To Operate Electric Buses: హైదరాబాద్ ప్రజలకు గుడ్‌న్యూస్, గ్రేటర్ పరిధిలో కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయం, ఎంఎంటీఎస్, మెట్రో రైలు అందుబాటులో లేని ఏరియాల్లో సర్వీసులు
ఎంఎంటీఎస్, మెట్రో రైలు అందుబాటులో లేని ఏరియాల్లో ఎలక్ట్రిక్ బస్సులను (Electric Buses) నడపాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్, మియాపూర్ డిపోల పరిధిలో ఈ బస్సులను నడిపేందుకు గ్రేటర్ హైదరాబాద్ జోన్ అధికారులు నిర్ణయించారు.
Hyderabad, AUG 27: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీఎస్ ఆర్టీసీ (TSRTC) కీలక నిర్ణయం తీసుకుంది. ఎంఎంటీఎస్, మెట్రో రైలు అందుబాటులో లేని ఏరియాల్లో ఎలక్ట్రిక్ బస్సులను (Electric Buses) నడపాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్, మియాపూర్ డిపోల పరిధిలో ఈ బస్సులను నడిపేందుకు గ్రేటర్ హైదరాబాద్ జోన్ అధికారులు నిర్ణయించారు. సికింద్రాబాద్ – పంజాగుట్ట – జూబ్లీహిల్స్ చెక్ పోస్టు – ఫిల్మ్ నగర్ – ఉస్మానియా కాలనీల మీదుగా మణికొండ వరకు నడపాలని నిర్ణయించారు. అదే విధంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి జూబ్లీ బస్ స్టేషన్, సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్, ఎల్‌బీ నగర్, ఇబ్రహీంపట్నం వరకు నడపాలని నిర్ణయించారు.
మియాపూర్ డిపో పరిధిలో బాచుపల్లి – జేఎన్‌టీయూ – కేపీహెచ్‌బీ – హైటెక్ సిటీ – బయోడైవర్సిటీ – గచ్చిబౌలి – వేవ్ రాక్ – ప్రగతి నగర్ – జేఎన్‌టీయూ, వీబీఐటీ వరకు ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తేనున్నారు. ఈ ఎలక్ట్రిక్ బస్సులన్నింటికి ట్రాకింగ్ సిస్టమ్‌ను అమర్చుస్తామని తెలిపారు. ప్రతి 30 నిమిషాలకో బస్సు అందుబాటులో ఉండే విధంగా బస్సులను నడపనున్నారు.