Pragathi Bhavan: సీఎం కేసీఆర్ క్యాంపు ఆఫీసు ప్రగతి భవన్ వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం, పోలీసులు వేధిస్తున్నారని.. సీపీ సజ్జనార్‌కు పిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపిన బాధితుడు

ఒంటిపై కిరోసిన్ పోసుకున్న వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డానికి య‌త్నించ‌గా అక్క‌డే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. ఆ వ్యక్తి ప్రగతి భవన్ ఎదుట శరీరంపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం ప్రయత్నం చేయగా అతని సోదరుడు మంత్రుల కాన్వాయ్ కి అడ్డంగా వెళ్లేందుకు యత్నించాడు.

Two People Tried To Commit Suicide at Pragathi Bhavan (Photo-Video Grab)

Hyderabad, June 8: తెలంగాణ సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాల‌యం ప్ర‌గ‌తి భ‌వ‌న్ వ‌ద్ద ఓ వ్య‌క్తి ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డ‌టం క‌ల‌కలం రేపింది. ఒంటిపై కిరోసిన్ పోసుకున్న వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డానికి య‌త్నించ‌గా అక్క‌డే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. ఆ వ్యక్తి ప్రగతి భవన్ ఎదుట శరీరంపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం ప్రయత్నం చేయగా అతని సోదరుడు మంత్రుల కాన్వాయ్ కి అడ్డంగా వెళ్లేందుకు యత్నించాడు.

ఈ సోదరులిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అత‌డిని అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు.తన ఇంటి విషయంలో కొంపెల్లి సీఐ మహేశ్ తీవ్ర ఇబ్బందులకు గురిచేయడంతో ఆత్మహత్యాయత్నం చేసినట్టు సదరు వ్యక్తి తెలిపాడు. ఈ విషయమై సీపీ సజ్జనార్‌కు పిర్యాదు చేసినా పట్టించుకోలేదని, సంబంధిత బిల్డర్‌తో పోలీసులు కుమ్మక్కు అయ్యారని ఆరోపించాడు.

Here's Video 

పెద్ద ఎత్తున డబ్బులు డిమాండ్ చేస్తున్నారని తెలిపాడు. బాధితుడి పేరు నర్సింగరావు కాగా, నివాసం మేడ్చల్ దగ్గర కొంపల్లి అని తెలుస్తోంది.



సంబంధిత వార్తలు

KTR: జనతా గ్యారేజ్‌లా తెలంగాణ భవన్..చరిత్ర చదవకుండా.. భవిష్యత్‌ను నిర్మించలేం, లగచర్ల భూముల సేకరణ విరమణ బీఆర్ఎస్ విజయమన్న కేటీఆర్

KTR: రాహుల్ గాంధీ తిట్టడంతోనే వెనక్కి తగ్గిన రేవంత్ రెడ్డి...అబద్దాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కేటీఆర్ ఫైర్, చిట్టినాయుడు చిప్ దొబ్బిందని ఎద్దేవా చేసిన కేటీఆర్

Eknath Shinde Resign: మహారాష్ట్ర సీఎం పదవికి ఏక్‌నాథ్‌ షిండే రాజీనామా, గవర్నర్‌కు రాజీనామా సమర్పించిన షిండే...సీఎం ఎవరన్నది ఇంకా సస్పెన్సే!

KTR: అదానీకి అండగా బడే భాయ్ - చోటే భాయ్...కాంగ్రెస్ పార్టీది గల్లీలో ఒక నీతి…ఢిల్లీలో ఒక నీతా? , రేవంత్‌ రెడ్డికి దమ్ముంటే లగచర్లకు రావాలని కేటీఆర్ సవాల్