KTR Slams CM Revanth Reddy on BC Caste Census(X)

Hyd, Feb 9:  బీసీల పట్ల కాంగ్రెస్ కపట నాటకం ప్రదర్శిస్తోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR). బీసీ ముఖ్య నేతల సమీక్ష సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. ఎన్నికల్లో బీసీల ఓట్ల కోసం లక్ష కోట్ల బడ్జెట్ పెడతామని చెప్పి గెలిచిన కాంగ్రెస్ పార్టీ అన్నారు(BC Caste Census). పదిహేను నెలలు గడిచినా కనీసం పదిహేను పైసలు కూడా ఖర్చు పెట్టలేదు అన్నారు.

కాంగ్రెస్ చేసిన కుల గణన సర్వే అంతా తప్పుల తడక..కావాలనే బీసీల సంఖ్యను ఐదున్నర శాతం తగ్గించి.. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలకు తీరని అన్యాయాన్ని చేస్తోంది కాంగ్రెస్ పార్టీ అన్నారు. అత్యధికంగా 50% కు పైగా టికెట్లను బీసీలకు ఇచ్చిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది అని గుర్తు చేశారు.

హర్యానాలో కేజ్రీవాల్‌ కాంగ్రెస్‌ను ఓడిస్తే.. మేము కేజ్రీవాల్‌ను ఢిల్లీలో ఓడించామన్న సీఎం రేవంత్ రెడ్డి.. కేరళ మాతృభూమి ఇంటర్నేషనల్‌ ఫెస్టివల్‌కు హాజరు

బలహీన వర్గాలకు అసెంబ్లీ, పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికల్లో టిక్కెట్లు ఇచ్చి, వారిని ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టింది బీఆర్ఎస్ పార్టీ అన్నారు. బీసీలకు రేవంత్ రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని.. కుల గణన పూర్తిగా తప్పుల తడక, అర్థరహితం, శాస్త్రీయతలేనిది అన్నారు. శాస్త్రీయంగా రీ-సర్వే చేసి, సరైన లెక్కలు తేల్చాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం అన్నారు.

శాస్త్రీయంగా మళ్లీ రీ-సర్వే చేయండి... రాష్ట్రంలో బలహీన వర్గాల బిడ్డలు ఆందోళనలో ఉన్నారు అన్నారు. మీరు మా జనాభా సంఖ్యని తక్కువ చేసి చూపినట్లయితే రేపు సంక్షేమ పథకాల్లో మీరు ఇవ్వబోయే ఇండ్లల్లో, మీరిచ్చే రేషన్ కార్డులలో, ఆరు గ్యారెంటీల్లో, 420 హామీల్లో మా వాటా తగ్గుతది అని, మాకు అన్యాయం జరుగుతుందని బీసీ బిడ్డలు ఆందోళన చెందుతున్నారు అన్నారు.

బీసీ కులగణన రీ-సర్వే చేయమని అడిగితే ఉల్టా చోర్ కొత్వాల్ కో దాంటే అనే విధంగా ఆనాడు చేసిన సమగ్ర కుటుంబ సర్వే తప్పు అనేలా ఈ ప్రభుత్వం మాట్లాడుతుందన్నారు. కామారెడ్డిలో కర్ణాటక సీఎం సిద్దరామయ్యతో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున వాగ్ధానాలు చేశారు.

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది.. బీసీల కోసం లక్ష కోట్ల బడ్జెట్ పెడతామని చెప్పారు .. బీసీ సబ్ ప్లాన్ తీసుకు వస్తామని సిద్దరామయ్య ద్వారా చెప్పించారు .. అదే విధంగా ప్రభుత్వ కాంట్రాక్టులల్లో 42 శాతం బీసీలకే ఇస్తామని ఆనాడు కాంగ్రెస్ పార్టీ చెప్పింది .. కానీ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడుస్తున్నా కనీసం 15 పైసల్ కూడా మీరు చెప్పిన బీసీ డిక్లరేషన్ కోసం కేటాయించలేదు అని మండిపడ్డారు.