Telangana: తెలంగాణలో తీవ్ర విషాదం, అమెరికాలో ఈతకు వెళ్లిన ఇద్దరు హనుమకొండ విద్యార్థులు మృతి, మరో ఇద్దరు గల్లంతు..
మిస్సోరిలోని ఓజార్క్ సరస్సులో (river in Missouri) ఈతకు వెళ్లిన నలుగురు తెలుగు విద్యార్థులు.. ప్రమాదవశాత్తు ఈత కొడుతూ అందులో గల్లంతయ్యారు.
Hyd, Nov 28: అమెరికాలోని మిస్సోరి రాష్ట్రంలో తెలంగాణకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఈతకు వెళ్లి మృతి (Two students from Telangana) చెందారు. మిస్సోరిలోని ఓజార్క్ సరస్సులో (river in Missouri) ఈతకు వెళ్లిన నలుగురు తెలుగు విద్యార్థులు.. ప్రమాదవశాత్తు ఈత కొడుతూ అందులో గల్లంతయ్యారు. వీరిలో వికారాబాద్‌కు చెందిన శివదత్తు, హనుమకొండకు చెందిన ఉత్తేజ్ మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ఇద్దరికోసం గాలిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం 2:40 గంటల ప్రాంతంలో ఇది జరిగినట్లు ఇక్కడికి అందిన సమాచారం.
మధ్యప్రదేశ్‌లో తల్లిదండ్రులకు షాక్, 7 సంవత్సరాల వయస్సు నుండి సిగరెట్ తాగడం నేర్చుకుంటున్న బాలికలు
నలుగురు తెలుగు విధ్యార్థులు మిస్సోరి రాష్ట్రం (Missouri) సెయింట్ లూయిస్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారు. హనుమకొండకు చెందిన ఉత్తేజ్ మరణ వార్త తెలియడంతో అతని తల్లిదండ్రులు జనార్థన్, ఝాన్సీ లక్ష్మీ బోరున విలపిస్తున్నారు. కాగా గతేడాది ఆగస్టులో అమెరికా వెళ్లిన ఉత్తేజ్ హెల్త్ సైన్స్ డేటాలో మాస్టర్స్ చేస్తున్నాడు.ఈ ప్రమాదంలో వికారాబాద్ జిల్లాతాండూరుకు చెందిన అపెక్స్ ఆస్పత్రి యజమాని వెంకటేశం, జ్యోతి దంపతుల రెండో కుమారుడు శివదత్తు (25) కూడా మరణించారు.
వైద్య విద్యను అభ్యసించేందుకు ఈ ఏడాది జనవరిలో అమెరికా వెళ్లాడు శివదత్తు. సెయింట్ లూయిస్ వర్సిటీలో డెంటల్ ఎంఎస్ విద్య అభ్యసిస్తున్నాడు. శనివారం దత్తు స్నేహితులతొ కలిసి ఓజార్క్ లేక్‌కు వెళ్లాడు. సరస్సులో ఈత కొడుతూ ప్రమాదవశాత్తు ఇద్దరూ మునిగిపోయారు. విషయం తెలిసి మృతుని తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.