Ujjaini Mahankali Bonalu: రాబోయే రోజులు మరింత ప్రమాదకరం, భవిష్య వాణిని వినిపించిన అమ్మవారు, చరిత్రలో తొలిసారిగా జనం లేకుండా ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతర
ప్రతి ఏటా అంగరంగవైభవంగా జరిగే సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతర (Ujjaini Mahankali Bonalu) ఈ ఏడాది భక్తులు లేకుంగానే సాగింది. కరోనా కారణంగా (COVID-19 Effect) ఈ ఏడాది భక్తులు లేకుండానే బోనాల పండుగ నిర్వహిస్తున్నారు. ఉజ్జయిని మహాకాళి ఆలయంలో ఈరోజు భవిష్యవాణి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారు స్వర్ణలతను అవహించి భవిష్యవాణి వినిపించారు. రాబోయే రోజులు ప్రమాదకరంగా ఉంటాయన్నారు. నా భక్తులను ముందుగానే హెచ్చరిస్తున్నానని తెలిపారు.
Hyderabad, July 13: నగరంలో ఆషాడమాసం బోనాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా అంగరంగవైభవంగా జరిగే సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతర (Ujjaini Mahankali Bonalu) ఈ ఏడాది భక్తులు లేకుంగానే సాగింది. కరోనా కారణంగా (COVID-19 Effect) ఈ ఏడాది భక్తులు లేకుండానే బోనాల పండుగ నిర్వహిస్తున్నారు. ఉజ్జయిని మహాకాళి ఆలయంలో ఈరోజు భవిష్యవాణి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారు స్వర్ణలతను అవహించి భవిష్యవాణి వినిపించారు. రాబోయే రోజులు ప్రమాదకరంగా ఉంటాయన్నారు. నా భక్తులను ముందుగానే హెచ్చరిస్తున్నానని తెలిపారు. తెలంగాణలో 34 వేలు దాటిన కొవిడ్ బాధితుల సంఖ్య, గత 24 గంటల్లో కొత్తగా మరో 1269 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 350 దాటిన కరోనా మరణాలు
ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదని చెప్పారు. కాపాడుకుందాం అనుకున్నా కానీ ప్రజలే చేతులారా చేసుకుంటున్నారు. తనకు సంతోషం లేదని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. అయితే కట్టడి చేయడానికి తాను ఉన్నానని.. భక్తి భావనతో ఐదు వారాలు శాక పోసి, యజ్ఞాలు చేయండని ఆజ్ఞాపించారు. ప్రతి గడప నుంచి శాక, పప్పుబెల్లాలు రావాలన్నారు. కామంతో కాకుండా, భక్తిభావనతో చేసినట్టైతే... తప్పక కాపాడతానన్నారు. ప్రజలందిరినీ తాను కాపాడతానని, కరోనాపై (COVID-19 pandemic) పోరాడతానని తెలిపారు. రాబోయే రోజులు కష్టాలతో ఉంటాయని.. తీవ్రస్వరంలో చెప్పారు.
Here's Ujjaini Mahankali Festival Visuals
ఇదిలా ఉంటే అమ్మవారి జాతర ప్రారంభమైనప్పటి నుంచి చరిత్రలో మొదటి సారిగా భక్తులు లేకుండానే బోనాల జాతర మొదలైంది. లక్షలాది మంది భక్తులు వచ్చే ఈ జన జాతర ఈ ఏడాది జనం లేని జాతరగా చరిత్రలో నిలిచిపోయింది. లష్కర్ బోనాల సందర్భంగా ఉజ్జయినీ మహంకాళి దేవాలయం చుట్టు ఎక్కడ భక్తుల జాడ కనిపించ లేదు. ఎటు చూసినా పోలీసులే కనిపిస్తున్నారు. అయితే అధికారులు అమ్మవారికి భక్తుల బోనం లేకున్నా సంప్రదాయాల్లో ఎలాంటి లోటు లేకుండా, శాస్త్రోక్తంగా బోనాల ఉత్సవాలను నిర్వహించారు.
Here's Ujjaini Mahankali Festival Visuals
కోవిడ్ నిబంధనల మధ్య సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి జాతర సంప్రదాయాలతో వైభవంగా జరిగింది. ఆదివారం ఉదయం 4.05 నిమిషాలకు మహాహారతితో మహంకాళి అమ్మవారికి పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మంత్రి తలసాని కుటుంబ సభ్యులు బోనాన్ని దేవాలయం బయటి వరకు తెచ్చి ఆలయ ఈవో మనోహర్‌రెడ్డికి అప్పగించారు. మహాహారతి అనంతరం ఆలయ అధికారులు అమ్మవారికి బోనం సమర్పించారు. ఆలయ ఈవో గుత్తా మనోహర్‌రెడ్డి అమ్మవారికి బంగారు బోనం, పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే ఆలయ సిబ్బంది అమ్మవారికి 7 బోనాలను సమర్పించారు. ఉదయం 4.45 నిమిషాలకు వరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 8గంటలకు ఆర్యసమాజ్, దక్కన్ మానవ సేవా సమితి ఆధ్వర్యంలో లోక కల్యాణం కోసం హోమం చేశారు.
అమ్మవారే కరోనాను తరిమి కొట్టాలి: మంత్రి తలసాని
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వ్యాధిని మహంకాళి అమ్మవారే తరిమికొట్టాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. ఆదివారం మహంకాళి బోనాల జాతర సందర్భంగా ఆయన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కలరా వ్యాధిని తరిమికొట్టడంతో 1815లో అప్పయ్యదొర మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినీ నుంచి అమ్మవారిని తీసుకుని వచ్చి ఇక్కడ ప్రతిష్టించారన్నారు. నాడు కలరా వ్యాధిని తరిమికొట్టిన అమ్మవారే నేడు కరోనాను కూడా దేశం నుంచి పారదోలాలని ప్రార్థించారు. అయితే ఈ ఏడాది ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జాతరకు భక్తులను అనుమతించడం లేదని ఇందుకు వారు క్షమించాలని కోరారు. ప్రభుత్వ సూచనలను భక్తులు, స్థానిక ప్రజలు పాటిస్తూ ఇంట్లోనే బోనాల ఉత్సవాలు జరుపుకున్నారని వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.