Sammakka Sarakka Central University: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్, రూ.889 కోట్లతో సమ్మక్క-సారక్క గిరిజన వర్సిటీ ఏర్పాటుకు ఆమోదం

అలాగే పసుపు బోర్డు, ములుగులో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపిందని అన్నారు. రూ.889 కోట్లతో సమ్మక్క-సారక్క గిరిజన వర్సిటీ ఏర్పాటుకు యూనియన్ కేబినెట్ ఆమోదం తెలిపిందని కిషన్ రెడ్డి తెలిపారు.

Union Minister Anurag Thakur (Photo-ANI)

దేశంలో త్వరలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.కేబినెట్‌ భేటీ అనంతరం కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, కిషన్‌ రెడ్డి మీడియాకు కేటినెట్‌ నిర్ణయాలకు వెల్లడించారు. తెలంగాణలో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుకు ఆమోదం తెలిపిందని కిషన్ రెడ్డి తెలిపారు. అలాగే పసుపు బోర్డు, ములుగులో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపిందని అన్నారు. రూ.889 కోట్లతో సమ్మక్క-సారక్క గిరిజన వర్సిటీ ఏర్పాటుకు యూనియన్ కేబినెట్ ఆమోదం తెలిపిందని కిషన్ రెడ్డి తెలిపారు.

కాగా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆదివారం మహబూబ్‌నగర్‌లో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కొన్ని కీలక ప్రకటనలు చేసిన సంగతి విదితమే. ములుగు జిల్లాలో రూ. 900 కోట్లతో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసి, గిరిజనుల ఆరాధ్యదైవమైన సమ్మక్క, సారక్క పేర్లను పెడతామని తెలిపారు. ఈ సంస్థను సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ అని పిలుస్తామని వెల్లడించారు.

కేంద్రం గుడ్ న్యూస్, తెలంగాణలో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుకు ఆమోదం, రూ.1,600 కోట్ల నుంచి రూ.8,400 కోట్లకు పసుపు ఎగుమతులే లక్ష్యంగా ఏర్పాటు..

ములుగులో కేంద్ర ప్రభుత్వం గిరిజన దేవతలైన సమ్మక్క, సారక్కల పేర్లతో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తుందని, ఈ కార్యక్రమానికి రూ. 900 కోట్లు కేటాయించామని, తెలంగాణ ప్రజలకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ప్రధాని మోదీ అన్నారు.

ఇక నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటును కూడా  ప్రధాని ప్రకటించారు. రవాణా, పెట్రోలియం, సహజ వాయువు మరియు ఉన్నత విద్య వంటి రంగాలలో విస్తరించి ఉన్న ₹ 13,500 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు కూడా ఆయన ప్రారంభోత్సవం, పునాది వేశారు .

హైదరాబాద్ (కాచిగూడ) - రాయచూర్ - హైదరాబాద్ (కాచిగూడ) మార్గంలో కృష్ణా స్టేషన్ నుండి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ మరియు తెలంగాణలోని నారాయణపేట జిల్లాలను కర్ణాటకలోని రాయచూర్ జిల్లాతో కలుపుతూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ రైలు సర్వీసును ప్రారంభించారు.

గుడ్ న్యూస్, ఉజ్వల ‍గ్యాస్‌ సిలిండర్లపై సబ్సిడీ రూ.200 నుండి రూ.300కి పెంపుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

ఈ రైల్వే సర్వీస్ మహబూబ్‌నగర్ - నారాయణపేట జిల్లాల్లో ఇంతకు ముందు అందుబాటులో లేని ప్రాంతాలకు కనెక్టివిటీని అందిస్తుంది. ఇది విద్యార్థులు, రోజువారీ ప్రయాణికులు, కార్మికులు మరియు ప్రాంతంలోని స్థానిక చేనేత పరిశ్రమకు ప్రయోజనం చేకూరుస్తుంది.



సంబంధిత వార్తలు

Corbin Bosch Creates History: పాకిస్థాన్ పై మ్యాచ్ లో చెల‌రేగిన ఆట‌గాడు, అరంగేట్రంలోనే అద‌ర‌గొట్టి స‌రికొత్త రికార్డు సృష్టించిన సౌతాఫ్రికా క్రికెట‌ర్

Manmohan Singh Funeral Ceremony: మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు బీఆర్ఎస్ నేతలు, తెలంగాణతో మన్మోహన్‌కు ప్రత్యేక అనుబంధం ఉందన్న కేసీఆర్, ప్రతి సందర్భంలో మనోధైర్యం నింపారని వెల్లడి

Weather Forecast: ఏపీ వెదర్ అలర్ట్, వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరిక, తెలంగాలో పెరుగుతున్న చలి

KCR Condolence To Manmohan Singh: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి.. మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగడం చారిత్రక సందర్భం అని వ్యాఖ్య