Amit Shah Telangana Tour Cancelled: మ‌రోసారి ర‌ద్ద‌యిన అమిత్ షా టూర్, తెలంగాణ‌లో రేపు జ‌రగాల్సిన ప‌ర్య‌ట‌న వాయిదా, కార‌ణం ఏంటంటే?

ఈ విషయాన్ని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి (Kishan Reddy) తెలిపారు. షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 28న ఆదివారం పర్యటించాల్సి ఉంది. పలు అత్యవసర పనులతో పర్యటన వాయిదా పడిందని (Amit Shah Telangana Tour Cancelled) ఆయన తెలిపారు.

G Kishan Reddy and Amit Shah. (Photo Credits: ANI)

New Delhi, JAN 27: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తెలంగాణ పర్యటన (Amit Shah Telangana Tour) రద్దయ్యింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి (Kishan Reddy) తెలిపారు. షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 28న ఆదివారం పర్యటించాల్సి ఉంది. పలు అత్యవసర పనులతో పర్యటన వాయిదా పడిందని (Amit Shah Telangana Tour Cancelled) ఆయన తెలిపారు. ఈ క్రమంలో కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌ సమావేశాలను వాయిదా వేసినట్లు తెలిపారు. బిహార్‌లో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే అమిత్‌ షా పర్యటన రద్దయినట్లు తెలుస్తున్నది.

KTR Traveling in an Auto: ఆటోలో ప్రయాణం చేసిన కేటీఆర్.. వైరల్ వీడియో చూస్తే షాక్ తింటారు..(Viral Video) 

బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ మహాకూటమి నుంచి బయటకు వస్తారని.. ఆ తర్వాత బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నది. ఈ క్రమంలోనే అమిత్‌ షాను బిహార్‌ లోక్‌జనశక్తి (రాంవిలాస్‌) పార్టీ నేత చిరాగ్‌ పాశ్వాన్‌ షాతో భేటీ అయ్యారు. రాష్ట్ర పరిస్థితులపై చర్చించినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే షా పర్యటన రద్దయ్యిందని, త్వరలోనే మరోసారి పర్యటన ఖరారు చేసే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు తెలిపాయి.



సంబంధిత వార్తలు

Telangana Assembly Session 2024: అప్పులపై చర్చకు మేం సిద్ధం.. బీఆర్ఎస్ సిద్ధమా, సవాల్ విసిరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సవాల్‌ను స్వీకరిస్తున్నామని తెలిపిన హరీష్ రావు, వీడియోలు ఇవిగో..

Telangana: తెలంగాణలో భూమిలేని వారికి రూ.6 వేలు, సంచలన నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రాష్ట్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు ఇవిగో..

TS Inter Exam Schedule 2025: తెలంగాణలో ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ ఇదిగో, మార్చి 5 నుంచి 25 వరకు ఇంటర్‌ పరీక్షలు, ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ప్రాక్టికల్స్‌

Telangana: చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటే ఇన్వెస్టర్లు భయపడుతున్నారు, మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు