Telangana Shocker: భార్యపై ఫ్రెండ్ కన్ను, కోపం తట్టుకోలేక బీరు సీసాతో కొట్టి చంపేసిన ఆమె భర్త, వికారాబాద్ జిల్లాలో దారుణ ఘటన

తన భార్యపై కన్నేశాడని.. ఒక్కసారి తన మోజు తీర్చాలని అడిగాడనే అనుమానంతో ఓ వ్యక్తిని మద్యం తాగించి బీరు సీసా, బండరాయితో తలపై మోది దారుణంగా హత్య చేశాడు

Representational image (Photo Credit- Pixabay)

Vikarabad, June 26: వికారాబాద్ జిల్లాలో మండల కేంద్రమైన దౌల్తాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన భార్యపై కన్నేశాడని.. ఒక్కసారి తన మోజు తీర్చాలని అడిగాడనే అనుమానంతో ఓ వ్యక్తిని మద్యం తాగించి బీరు సీసా, బండరాయితో తలపై మోది దారుణంగా హత్య చేశాడు ఓ భర్త. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సీ శేఖర్‌(32) హైదరాబాద్‌లో కూలి పనులు చేసుకుంటూ భార్య పిల్లలతో ఉంటున్నాడు.

ఇదే గ్రామానికి చెందిన బీ గోపాల్‌ నగరంలో పనిచేస్తున్నాడు. ఇద్దరిదీ ఒకే గ్రామం కావడంతో కలిసి కూలి పనులు చేసుకునే వారు. దౌల్తాబాద్‌లో వీరి ఇళ్లు పక్కపక్కనే ఉంటాయి. గోపాల్‌ రెండు నెలల క్రితం, శేఖర్‌ నాలుగు రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చారు. శేఖర్‌ తన భార్యపై కన్నేశాడని.. ఒక్క సారి మోజు తీర్చాలని అడిగినట్లు గోపాల్‌కు అనుమానం వచ్చింది.

మరొకరితో అక్రమ సంబంధం అనుమానం, భార్య ప్రైవేట్ పార్టులో కత్తితో పొడిచిన ప్రియుడు, బెంగుళూరులో షాకింగ్ ఘటన

ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం శేఖర్‌ ఇంటికెళ్లి గోపాల్‌ను బయటకు తీసుకెళ్లాడు. ఇద్దరూ ఓ దాబాలో మద్యం తాగారు. అనంతరం మద్యం బాటిళ్లు తీసుకుని గుముడాల రోడ్డులోని ఓ పొలంలోకి వెళ్లారు. అక్కడ వారిద్దరి మధ్య మాటామాటా పెరిగి గొడవ జరిగింది. గోపాల్‌ బీరు సీసా, బండరాయితో శేఖర్‌ తలపై మోది అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

రాత్రి 10గంటల సమయంలో గోపాల్‌ ఒక్కడే ఇంటికి రావడంతో శేఖర్‌ భార్య.. నా భర్త ఎక్కడ అని ఆరా తీసింది. తనకు తెలియదు అని చెప్పాడు. అనుమానం రావడంతో కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గోపాల్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు.

మరొక వ్యక్తితో భార్య అక్రమ సంబంధం.. కోపంతో అతడి గొంతు కోసేసి రక్తం తాగేసిన భర్త.. కర్ణాటకలో షాకింగ్ ఘటన

శేఖర్‌పై తానే దాడి చేసినట్లు ఒప్పుకున్నాడు. ఘటనా స్థలానికి వెళ్లి చూడగా చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. చికిత్స నిమిత్తం కొడంగల్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడి భార్య ఉషంతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif