Weather Forecast: బయటకు రాకండి, తెలంగాణలో 4 రోజుల పాటు భారీ వర్షాలు, రెడ్, ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ, భారీ వర్షాలతో తడిసి ముద్దయిన హైదరాబాద్

మరో రెండు రోజులపాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు ( rain for the next 4 days) కురవనున్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. ఉత్తర, దక్షిణ తెలంగాణలో భారీ వర్షాలు, పలుచోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

Heavy Rains in HYD

Hyd, July 22: తెలంగాణలో పలు జిల్లాల్లో ఆరెంజ్‌, ఎల్లో అలర్ట్‌ ఐఎండీ (IMD) ప్రకటించింది. మరో రెండు రోజులపాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు ( rain for the next 4 days) కురవనున్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. ఉత్తర, దక్షిణ తెలంగాణలో భారీ వర్షాలు, పలుచోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు పడనున్నట్లు పేర్కొంది. హైదరాబాద్‌లో రాగల 48 గంటలపాటు విస్తారంగా వర్షాలు పడనున్నాయని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్‌ పోలీసులు (Hyd Police) ప్రజలను అప్రమత్తం చేశారు.

అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. హైదరాబాద్‌లో (Heavy rains continue in Hyderabad) ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో మోకాళ్లలోతు నీళ్లు వచ్చాయి. రోడ‍్లపై భారీగా వరద నీరు చేరడంతో ట్రాఫిక్‌ స్తంభించింది. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జీడిమెట్ల, కుత్బుల్లాపూర్‌, శేరిలింగంపల్లిలో 8 సెం.మీ వర్షపాతం, కూకట్‌పల్లి, బాలాజీనగర్‌, బాలానగర్‌లో 7 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఇక మాదాపూర్‌, మచ్చబొల్లారం, జగద్గిరిగుట్ట, మియాపూర్‌, ఆర్సీపురం, రంగారెడ్డినగర్‌లో 6 సెం.మీ వర్షాపాతం, ఫతేనగర్‌, మౌలాలీ, హెచ్‌సీయూ, మోతీనగర్‌లో 5 సెం.మీ వర్షాపాతం నమోదైంది.

హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ పోలీసులు కీలక సూచన, వర్షం ఆగిందని ఆగమాగం బయటకు రావొద్దని హెచ్చిరిక

పలు జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఐదు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే 18 జిల్లాల్లో భారీ వర్షాలు (Heavy rain) పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ రోజు ఉదయం నుంచి హైదరాబాద్‌ (Hyderabad)లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. వర్షానికి భాగ్యనగరం తడిసిముద్దవుతోంది. సికింద్రాబాద్ (Secunderabad), అల్వాల్, మాదాపూర్, గచ్చిబౌలి, మియాపూర్, కూకట్ పల్లి, చందానగర్, తార్నాక, బాలానగర్, జీడిమెట్ల, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్, యూసఫ్ గూడ, అమీర్ పేట్, ఎస్సార్ నగర్, పంజాగుట్ట, ఎర్రగడ్డ, జూబ్లీహిల్స్, మసబ్ ట్యాంక్, కాచిగూడ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది.

ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. షియర్ జోన్ ప్రభావంతోనే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, మరికొన్ని చోట్ల ఓ మోస్తరు వర్ష పాతం నమోదవ్వచ్చన్న నేపథ్యంలో విపత్తు నిర్వహణ బృందాలు(DRF- Disaster Response Force) అప్రమత్తమయ్యాయి. అత్యవసర సాయం కోసం 040-29555500 నెంబర్‌కు ఫోన్ చేయాలని అధికారులు ప్రజలకు సూచించారు.