Telangana Weather Forecast: తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్, వచ్చే రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఏపీకి కూడా వానల అలర్ట్

వచ్చే మూడురోజులు స్థిరమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో పలు జిల్లాల్లో వీస్తాయని బులిటెన్‌లో పేర్కొంది.

Weather Update (photo-ANI)

Hyd. August 1: తెలంగాణలో రాగల రెండురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వచ్చే మూడురోజులు స్థిరమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో పలు జిల్లాల్లో వీస్తాయని బులిటెన్‌లో పేర్కొంది.గురువారం నుంచి శుక్రవారం వరకు జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, మహబూబాబాద్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజగిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది.  వీడియో ఇదిగో, కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన చంద్రబాబు, శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తివేత, రిజర్వాయర్‌కు క్రమంగా పెరుగుతున్న వరదప్రవాహం

శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్‌, హన్మకొండ, మెదక్‌, కామారెడ్డి, నాగర్‌ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉందని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.

వీడియో ఇదిగో, భారీ వరదలకు 5 సెకండ్లలో కుప్పకూలిన భారీ భవనం, పార్వతీ నదిలో కొట్టుకుపోయిన భవన శిథిలాలు

ఇక దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. మరో ఐదు రోజుల పాటు ఏపీ రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.పశ్చిమ భారత్‌లో రుతుపనాలు చాలా యాక్టివ్‌గా ఉన్నందున వీటి ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంటుందని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ రెండు వారాలుగా వర్షాలు కురుస్తున్నాయి.

అయితే మరో ఐదు రోజుల పాటు ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.శ్రీకాకుళం, మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణ, ప్రకాశం, నంద్యాల, అనంతపురం, నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.