Telangana Weather Update: తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరిక
ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. వర్షాల ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు, ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
తెలంగాణలో నేటి నుంచి మూడు రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. వర్షాల ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు, ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
నిజామాబాద్, జగిత్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, యాదాద్రి భువనగరి, హనుమకొండ, హైదరాబాద్, రంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, నాగర్ కర్నూలు, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో నేడు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. చేసింది.
ఓవైపు ఇలా ఉంటే మరోవైపు రాష్ట్రంలోని 9 జిల్లాలు.. పెద్దపల్లి, కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, వరంగల్, ములుగు, భూపాలపల్లి, ఖమ్మం, హనుమకొండ జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నట్లు వ్యవసాయశాఖ తెలిపింది ఈ జిల్లాలో అతి తక్కువ వర్షపాతం నమోదైందని పేర్కొంది.