High Court of Telangana | (Photo-ANI)

Child loses claim to inheritance from biological Family: దత్తత పిల్లలకు ఆస్తి పంపకం విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. దత్తత వెళ్లిన వారికి తాము జన్మించిన కుటుంబం ఆస్తిలో హక్కు ఉండదని తెలంగాణ హైకోర్టు తాజాగా స్పష్టం చేసింది. దత్తతకు మునుపే ఆస్తి పంపకాలు పూర్తయితేనే పుట్టింట కుటుంబంలో ఆస్తి హక్కు దక్కుతుందని పేర్కొంది.

దత్తత వెళ్లినప్పటికీ పుట్టిన కుటుంబంలో ఆస్తి హక్కు ఉంటుందంటూ ఖమ్మం జిల్లా కొణిజెర్ల మండలానికి చెందిన ఎ.వి.ఆర్. ఎల్. నరసింహారావు జిల్లా సివిల్ కోర్టులో కేసు వేశారు. ఈ క్రమంలో కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. దీన్ని సవాలు చేస్తూ నరసింహారావు సోదరుడు వి. నాగేశ్వరరావు, ఇతర కుటుంబసభ్యులు హైకోర్టును ఆశ్రయించారు.

లివ్-ఇన్ రిలేషన్‌లో ఉన్న మహిళ రక్షణపై కోర్టు కీలక వ్యాఖ్యలు, సమాజ నిర్మాణాన్ని పణంగా పెట్టి ఆ సంబంధాలను అనుమతించలేమని వెల్లడి

ఈ కేసుపై జస్టిస్ పి. నవీన్ రావు, జస్టిస్ బి. విజయ్‌సేన్ రెడ్డి, జిస్టిస్ నగేశ్ భీమపాకలతో కూడిన పూర్తిస్థాయి ధర్మాసనం సుదీర్ఘంగా విచారణ జరిపి ఇటీవలే తీర్పు వెలువరించింది. దత్తత వెళ్లిన వ్యక్తికి తాను పుట్టిన కుటుంబంతో సంబంధాలన్నీ తెగిపోతాయని చట్టం చెబుతున్నట్టు ధర్మాసనం పేర్కొంది. కాబట్టి, తాము జన్మించిన కుటుంబం ఆస్తిలో వారికి ఎటువంటి హక్కు ఉండదని స్పష్టం చేసింది. పూర్వీకుల ఆస్తిలో హక్కు ఉన్నప్పటికీ, పుట్టింటి వారు సంపాదించిన ఆస్తిలో మాత్రం వాటా ఉండదని పేర్కొంది.