Wine Shops Close For 2 Days: రెండు రోజుల పాటూ వైన్ షాపులు బంద్, ఈ ప్రాంతాల్లో బార్లు, వైన్స్, మద్యం అమ్మకాలపై ప్రత్యేక నిఘా
గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ (Cyberabad Police) పరిధిలో మద్యం షాపులు (Wine Shops Close), కల్లు దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు మూసివేస్తున్నట్లు సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Hyderabad, SEP 13: గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ (Cyberabad Police) పరిధిలో మద్యం షాపులు (Wine Shops Close), కల్లు దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు మూసివేస్తున్నట్లు సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిమజ్జనోత్సవం (Vinayaka Nimajjanam) సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు, కల్లు దుకాణాలను మూసివేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఈ నెల 17న ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని, అప్పటి వరకు మద్యం సరఫరాపై నిషేధం ఉంటుందన్నారు. నిషేధిత సమయంలో ఎవరైన నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు జరిపినా, సరఫరా చేసినా బెల్టుషాపులు నిర్వహించినా చట్టరీత్య కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా సీపీ హెచ్చరించారు.