Dengue Cases Rise in GHMC: హైదరాబాద్ వాసులను హడలెత్తిస్తున్న డెంగ్యూ జ్వరాలు, తాజాగా మహిళా డాక్టర్ మృతి, భాగ్యనగరంలో రోజు రోజుకు పెరుగుతున్న డెంగ్యూ కేసులు

తాజాగా డెంగీ వ్యాధి బారిన పడి ఓ వైద్యురాలు మృతి చెందింది. జీడిమెట్ల డివిజన్‌ మీనాక్షీ కాలనీకి చెందిన డాక్టర్‌ అర్పితారెడ్డి (32)కి వారం రోజుల క్రితం జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు.

Dengue warning signs (Photo Credits: Pixabay)

Hyderabad, Sep 6: తెలంగాణ రాజధాని భాగ్యనగరంలో కరోనా తగ్గుతుంటే తాజాగా డెంగ్యూ కేసులు కలవరం (Dengue Cases Rise in GHMC) పుట్టిస్తున్నాయి. తాజాగా డెంగీ వ్యాధి బారిన పడి ఓ వైద్యురాలు మృతి చెందింది. జీడిమెట్ల డివిజన్‌ మీనాక్షీ కాలనీకి చెందిన డాక్టర్‌ అర్పితారెడ్డి (32)కి వారం రోజుల క్రితం జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు డెంగీగా నిర్ధారించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి (Woman Doctor died with dengue Fever) చెందింది.

అదే కాలనీకి చెందిన జార్సీరాణి డెంగీతో పది రోజులుగా ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొంది సురక్షితంగా బయటపడ్డారు. మరో మహిళ సౌమ్య అత్యవసర వైద్య చికిత్స పొందుతున్నారు. ఒకే కాలనీకి చెందిన ముగ్గురు వేర్వేరు కుటుంబాల మహిళలు డెంగీ బారిన పడడం, ఒకరు మృతి చెందడంతో కలవరం మొదలైంది. వర్షాకాలం వర్షాలతో జనావాసాల మధ్య అక్కడక్కడ నీరు నిలుస్తుండటంతో దోమల సమస్య పెరగటంతో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి.

రంబుటాన్ పండు తినడం వల్లే బాలుడు నిఫా వైరస్ సోకి మరణించాడా, కేరళలో కలవరం పుట్టిస్తున్న నిఫా వైరస్

తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 1811 కేసులు నమోదు కాగా వాటిలో ఒక్క హైదరాబాద్‌లోనే 594 కేసులు నమోదయ్యాయి. ప్రతీ 100 నివసాల్లో 16 డెంగ్యూ కేసులు నమోదు అవుతున్నట్లుగా తెలుస్తోంది. 2018తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ (Dengue cases rise in Telangana) అని అధికారు తెలిపారు. దోమలు ఎక్కువగా ఉండే నివసా ప్రాంతాలను ప్రభుత్వం గుర్తిస్తోంది. ఆయా ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలు చేపట్టనుంది. ప్రతీ 100 నివాసాల ప్రాంతాల్లో 15 చోట్ల దోమల లార్వా ఉనికి గుర్తించటం ద్వారా వాటిని అంతమొందించేలాచర్యలు తీసుకునే చర్యలు చేపడుతున్నారు.

హైదరాబాద్‌తో పాటు, మహబూబ్‌నగర్, నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి మరియు పెద్దపల్లిల్లో డెంగ్యు ఇండెక్స్ 10 కంటే ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు. దోమలు ఓవర్ హెడ్ ట్యాంకులు,ఓపెన్ సెప్టిక్ ట్యాంకులతో పాటు పూల కుండీలు, తాగి పారేసిన మద్యం సీసాలపై కూడా సంతానోత్పత్తి చేస్తాయని కాబట్టి జాగ్రత్తగా ఉండాలని పరిశరాలను శుభ్రంగా ఉండేలా చేసుకోలని తెలిపారు. ఉపయోగించని ప్లాస్టిక్ వస్తువులు, టైర్లు,బీర్ బాటిల్స్‌పై డెంగ్యూ దోమలు ఎక్కువగా పెరుగుతాయని వెల్లడించారు. చాలామంది ఇంటి డాబాలపై మద్యం తాగి వాటిని అక్కడే ఉంచేయటంతో..వర్షాకాలంలో దోమలు పెరిగే అవకాశాలుంటాయని కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

కొత్త వేరియంట్లు వస్తేనే థర్డ్ వేవ్‌కు అవకాశం, దేశంలో కరోనా అదుపులోనే ఉందని తెలిపిన ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ మణీంద్ర అగర్వాల్, భారత్‌లో తాజాగా 38,948 కోవిడ్ కేసులు నమోదు

డెంగ్యూ బాధితుల్లో ప్లేట్‌లెట్‌ కౌంట్, గాల్ బ్లాడర్ ఇన్‌ఫెక్షన్స్ పెరుగుతున్నాయని డాక్టర్లు తెలిపారు.రానున్న మరికొద్ది వారాల్లో డెంగ్యూతో పాటు ఇతర ఇన్ ఫెక్షన్స్ కేసులు మరింత పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. దోమ కాటు నివారణ చర్యలు చేపట్టకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. డెంగ్యూ దోమలు సాయంత్రం,తెల్లవారుజాము సమయాల్లో ఎక్కువ చురుగ్గా ఉంటాయన్నారు. ఆ సమయంలో వాకింగ్‌కి వెళ్లేవారు,బయట తిరిగేవారు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పారిశుద్ధ్యం సరిగా లేనిచోట డెంగ్యూ కారక దోమలు ఎక్కువగా ఉంటాయన్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం,నీరు నిల్వం ఉండకుండా చేయడం ద్వారా దోమలను అరికట్టవచ్చని సూచించారు.

దోమలు ఉండే ప్రదేశంలో శరీరాన్ని పూర్తిగా కప్పే దుస్తులు ధరించాలని.. జ్వరం వచ్చినవారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్లను సంప్రదించాలని సూచించారు. వ్యాధిని త్వరగా గుర్తించడం ద్వారా ముప్పును తగ్గించవచ్చునని చెప్పారు. డెంగ్యూ ప్రభావం తీవ్రంగా ఉండి కొన్నిసార్లు మరణం కూడా సంభవిస్తుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.