MLA Sexual Harassment: ఎమ్మెల్యే రాజయ్యపై మరోసారి లైంగిక వేధింపుల ఆరోపణలు, మహిళా సర్పంచ్‌ను వేధిస్తున్నారంటూ వార్తలు, రాజకీయ కుట్రలో భాగమే అంటూ ఖండించిన రాజయ్య

ఎమ్మెల్యే తనను లైంగికంగా వేధిస్తున్నారని (sexual harassment) నీకు డబ్బు కావాలన్నా..బంగారం కావాలన్నీ ఏది కావాలన్నా ఇస్తాను నా కోరిక తీర్చు అంటూ వేధిస్తున్నారని జానకీపురం మహిళా సర్పంచ్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ సంచలన ఆరోపణలపై ఎమ్మెల్యే రాజయ్య స్పందించారు

BRS legislator Rajaiah (PIC @ Rajaiah FB)

Warangal, March 10: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య (Rajaiah) మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యే తనను లైంగికంగా వేధిస్తున్నారని (sexual harassment) నీకు డబ్బు కావాలన్నా..బంగారం కావాలన్నీ ఏది కావాలన్నా ఇస్తాను నా కోరిక తీర్చు అంటూ వేధిస్తున్నారని జానకీపురం మహిళా సర్పంచ్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ సంచలన ఆరోపణలపై ఎమ్మెల్యే రాజయ్య స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలను ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య (Taikonda rajaiah) తీవ్రంగా ఖండించారు. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో కొంతమంది నాపై కుట్ర పన్ని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని నేను ఎవ్వరికి ఫోన్లు చేయలేదు..ఎటువంటి వేధింపులకు పాల్పడలేదని రాజయ్య తెలిపారు.

Telangana: సీన్ రివర్స్ బాసూ, రూ. 2 లక్షల కట్నం సరిపోలేదని గంట ముందు పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న వధువు, లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించిన వరుడు కుటుంబం  

నాపై రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని ఇటువంటి కుట్రలు నాపై జరగటం తొలిసారి కాదని గతంలో కూడా జరిగాయని చెప్పుకొచ్చారు తాటికొండ రాజయ్య. నాపై వచ్చిన ఆరోపణలు కేవలం రాజకీయ కుట్రలో భాగమని గత ఎన్నికల్లో చేసినట్లుగానే ఇప్పుడు కూడా నాపై కుట్రలు చేస్తున్నారని నాపై వచ్చిన ఈ ఆరోపణల గురించి స్వయంగా సీఎం కేసీఆర్ ను..కలిసి అన్నీ వివరిస్తానని తెలిపారు. ఇంటి దొంగలే శిఖండులగా మారి నాపై ఇటువంటి కుట్రలు చేసి రాజకీయంగా నన్ను దెబ్బతీయాలను చూస్తున్నారని చెప్పుకొచ్చారు రాజయ్య. ప్రజల్లో తనకు ఉన్న ఆదరణకు సహించలేని కొంతమంది చేసే కట్ర అంటూ కొట్టిపారేశారి ఎమ్మెల్యే రాజయ్య.



సంబంధిత వార్తలు

KTR On Rythu Bharosa: మాట తప్పిన బేమాన్ ప్రభుత్వం..రైతు బంధు పథకం లేకుండా చేయాలనే కుట్ర, రైతు భరోసాకు డిక్లరేషన్ సరికాదన్న కేటీఆర్..కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని పిలుపు

RS Praveen Kumar: పోలీసుల ఆత్మహత్యలపై ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక సూచన, ఇలా చేస్తే ఆత్మహత్యలను ఆపవచ్చు..మానసిక ఒత్తిడిని అధిగించాలంటే ఇలా చేయండన్న ఆర్‌ఎస్పీ

CM Revanth Reddy: ప్రజలకు అందుబాటులో ఉండండి..పాత, కొత్త నాయకులు అంతా కలిసి పనిచేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేల ప్రొగ్రెస్ రిపోర్ట్ త్వరలో వెల్లడిస్తానన్న ముఖ్యమంత్రి

KCR: 2025లో ప్రజలందరికీ మంచి జరగాలి..నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మాజీ సీఎం కేసీఆర్, తెలంగాణ భవన్‌లో క్యాలెండర్ ఆవిష్కరించనున్న కేటీఆర్