Hyderabad Shocker: హైదరాబాద్‌లో దారుణం, ఉద్యోగం పేరుతో యువతిని లాడ్జీకి తీసకెళ్లి రేప్ చేసిన మృగాడు, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్, జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన యువతి...

దారుణ ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. ఈ సంఘటనపై చైతన్యపురి పోలీసు స్టేషన్‌లో యువతి జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

Representational Image (Photo Credits: File Image)

ఉద్యోగం పేరుతో ఓ మృగాడు యువతిపై అత్యాచారం చేశాడు. దారుణ ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది.  ఈ సంఘటనపై చైతన్యపురి పోలీసు స్టేషన్‌లో యువతి జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీంతో ఆ కేసును సంబంధిత ఎస్‌ఆర్ నగర్ పోలీసు స్టేషన్‌కు పంపించి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా ఈ సంఘటనపై స్థానిక ఎస్సై సైదులు తెలిపిన వివరాల ప్రకారం కర్నూలు జిల్లాకు చెందిన ఓ యువతి నగరంలోని చైతన్యపురికాలనీలో టెలికాలర్ ఉద్యోగిగా పని చేస్తోంది. అయితే ఆమె నంబర్ సంపాదించిన నిందితుడు తనకు తాను సిద్దార్ధరెడ్డిగా పరిచయం చేసుకున్నాడు.

నా భార్య మీదే జోక్ వేస్తావా, కమెడియన్ చెంప పగలగొట్టిన ఆస్కార్ ఉత్తమ నటుడు స్మిత్, తరువాత క్షమాపణలు కోరిన విల్ స్మిత్

ఈ తర్వాత మాయమాటలు చెప్పి ఆమెకు అధిక జీతం వచ్చే ఉద్యోగం తన కంపనీలో ఇప్పిస్తానని చెప్పాడు. ఈ క్రమంలోనే ఈ నెల 9న కారులో దిల్‌సుఖ్‌నగర్‌కు వచ్చి యువతిని తనతో పాటు ఎర్రగడ్డకు తీసుకువచ్చాడు. మధ్యలో ఆమె ఐడి కార్డుతో పాటు ఫోటోలు, సంబంధిత పత్రాలు తీసుకున్నాడు. ఆ తర్వాత ఎస్సార్ నగర్‌లోని ఓయో హోటల్‌కు తీసుకువచ్చి యువతి పేరుమీద రూంబుక్ చేశాడు. అయితే లాడ్జికి తీసుకువచ్చిన యువతి ప్రశ్నించడంతో రాత్రి భోజనం తర్వాత ఉద్యోగం గురించి మాట్లాడి అడ్వాన్స్ చెల్లిస్తానని చెప్పాడు. దీంతో సాయంత్రం వరకు వేచి చూసిన యువతిపై బలవంతంగా రేప్ చేసినట్టు యువతి ఫిర్యాదులో పేర్కోంది. మరోవైపు విషయం ఎవరికైనా చెబితే... ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరింపులకు దిగాడు.

దీంతో ఆ యువతి నేరుగా తల్లిదండ్రులకు వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పింది. ఈ క్రమంలోనే యువతి తల్లిదండ్రులతో కలిసి చైతన్యపురి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే సంఘటన జరిగిన ఎస్ఆర్‌నగర్ పోలీసు స్టేషన్‌‌కు పంపించి ఎఫ్ఐఆర్ బుక్ చేసినట్టు పోలీసులు తెలిపారు.



సంబంధిత వార్తలు

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్

One Nation, One Election: జమిలి ఎన్నికల బిల్లుపై ఓటింగ్‌, డుమ్మా కొట్టిన 20 మంది బీజేపీ ఎంపీలు, నోటీసులు జారీ చేసిన అధిష్టానం, సాధారణ మెజారిటీతో జేపీసీకి వన్‌ నేషన్, వన్‌ ఎలక్షన్‌ బిల్లు

Uttar Pradesh Horror: యూపీలో 5 ఏళ్ళ బాలుడిపై దారుణ అత్యాచారం, హత్య, వెను భాగం నుంచి తీవ్ర రక్తస్రావం, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

Formula E Race Case: ఫార్ములా-ఈ కార్‌ రేసు కేసు, దమ్ముంటే ప్రభుత్వం అరెస్ట్ చేసుకోవచ్చని కేటీఆర్ సవాల్, రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు సిద్ధమవుతామని ప్రకటించిన బీఆర్ఎస్