Suicide: పక్కింటి ఆంటీ మాట్లాడటం లేదని మనస్థాపంతో యువకుడు ఆత్మహత్య, ఆమె ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకున్న ఎలక్ట్రీషియన్

సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.

Image used for representational purpose | (Photo Credits: PTI)

Hyderabad November 25: పక్కింట్లో ఉండే ఆంటీ తనతో మాట్లాడం లేదని మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు ఓ యువకుడు. సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. బల్కంపేటకు చెందిన పి. దుర్గేష్‌ (31) గత రెండు సంవత్సరాలుగా ఓల్డ్​‍ బోయిన్‌పల్లిలోని మైత్రీవనం రాంరెడ్డి కాలనీ లోని ఇంట్లో ఎలక్ట్రిషన్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆ ఇంట్లో ఉండే ఓ మహిళతో దుర్గేష్‌కు పరిచయం ఏర్పడింది. సదరు మహిళ తరచూ దుర్గేష్‌తో మాట్లాడుతూ ఉండేది. వారి ఇంటిలో ఏసీకి సంబంధించిన పనితో పాటు ఇతర ఎలక్టికల్‌కు సంబంధించి ఏ పనికైనా దుర్గేష్‌నే పిలిపించి పని చేయించుకునేవారు. దీంతో తరచూ ఆమెతో మాట్లాడుతుండేవాడు. తరచూ వారి ఇంటికి వెళ్లూ ఉండేవాడు.

అయితే ఉన్నట్లుండి కొన్నిరోజులుగా ఆ మహిళ దుర్గేష్‌తో మాట్లాడటం మానేసింది. తనతో ఎందుకు మాట్లాడటం లేదని పలుమార్లు ప్రశ్నించాడు దుర్గేష్. ఆమెతో మాట్లాడేందుకు పలుమార్లు ప్రయత్నించాడు. కానీ ఆమె మాట్లాడక పోవడంతో మనస్థాపం చెందిన దుర్గేష్‌ సదరు మహిళ ఇంటికి వెళ్లాడు. మొదటి అంతస్థులోని వారి బెడ్‌ రూమ్‌లోకి వెళ్లి తలుపులు పెట్టుకుని ఫ్యాన్‌కు తన చొక్కాతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై దుర్గేష్‌ తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif