Sharmila Hunger Strike: షర్మిల అమరణ దీక్ష భగ్నం చేసిన పోలీసులు, దీక్షకు అనుమతి లేదంటూ అరెస్ట్ , కేసీఆర్ పదేపదే తప్పు చేస్తున్నారని షర్మిల మండిపాటు

దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు ఆమెను అడ్డుకున్నారు

YS Sharmila (Photo-Video Grab)

Hyd, Dec 9: తెలంగాణ పోలీసులు తన పాదయాత్రకు అనుమతి ఇవ్వకపోవడంతో నిరసన వ్యక్తం చేస్తూ వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన ఆమరణ దీక్షను (Sharmila Hunger Strike) పోలీసులు భగ్నం చేశారు. దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం ముందు దీక్షలో కూర్చున్న షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి పోలీసు వాహనంలో ఆమెను బలవంతంగా తరలించారు.

అడ్డుకునేందుకు యత్నించిన కార్యకర్తలను పక్కకు తోసేసి ఆమెను తీసుకెళ్లారు.ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ కేసీఆర్ మరోసారి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు. కేసీఆర్ పదేపదే తప్పు చేస్తున్నారని... ఆయన పతనానికి ఇదే నాంది అని అన్నారు. మరోవైపు షర్మిలపై కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్టు చెపుతున్నారు.

భార‌త రాష్ట్ర స‌మితి జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్, తెలంగాణ భ‌వ‌న్‌లో భార‌త రాష్ట్ర స‌మితి ఆవిర్భావ వేడుక‌లు

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరాహార దీక్ష (YS Sharmila hunger strike) చేపట్టారు. తన పాదయాత్రకు పోలీసులు అనుమతించకపోవడంతో ఆమె దీక్షకు దిగారు. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రాన్ని ఇచ్చారు. షర్మిలకు సంఘీభావం తెలిపేందుకు అక్కడకు పెద్ద సంఖ్యలో వైఎస్సార్టీపీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు.

ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మండిపడ్డారు. తన పాదయాత్రను ఆపేందుకు కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని అన్నారు. తన పాదయాత్రకు హైకోర్టు పర్మిషన్ కూడా ఉందని... అయినప్పటికీ కేసీఆర్ న్యాయస్థానాన్ని కూడా అగౌరవపరుస్తున్నారని విమర్శించారు. తాను పాదయాత్ర చేస్తే మీకు వచ్చిన నష్టం ఏమిటని ఆమె ప్రశ్నించారు.

నా పాదయాత్రను చూసి కేసీఆర్ కు భయం పట్టుకుంది.. ఆయన నుంచి నాకు ప్రాణహాని ఉంది.. వైయస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల సంచలన వ్యాఖ్యలు

వైఎస్సార్టీపీ అంటే భయం లేకపోతే పాదయాత్రను ఎందుకు అడ్డుకుంటున్నారని అడిగారు. ఇప్పటికే 85కు పైగా నియోజకవర్గాలను దాటొచ్చామని... ఇప్పుడు తమకు అడుగడుగునా ఎందుకు ఆటంకాలు కల్పిస్తున్నారని ప్రశ్నించారు. తన పాదయాత్రను ఆపడం ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి తగునా? అని షర్మిల ప్రశ్నించారు