Sharmila Fires On KCR: నా పాదయాత్రను చూసి కేసీఆర్ కు భయం పట్టుకుంది.. ఆయన నుంచి నాకు ప్రాణహాని ఉంది.. వైయస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల సంచలన వ్యాఖ్యలు
File (Credits: Twitter/ANI)

Hyderabad, Dec 5: తెలంగాణ ముఖ్యమంత్రి (Telangana Chief Minister) కేసీఆర్ (KCR) పై వైయస్సార్టీపీ (YSRTP) అధ్యక్షురాలు షర్మిల (Sharmila) సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పాదయాత్రను చూసి కేసీఆర్ కు భయం (Fear) పట్టుకుందని అన్నారు. అందుకే తన పాదయాత్రను అడ్డుకునేందుకు పోలీసులను (Police) రంగంలోకి దించుతున్నట్టు విమర్శించారు.

బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. టాటాఏస్ వాహనం బోల్తా.. నలుగురు అయ్యప్ప భక్తులు దుర్మరణం.. మరో 16 మందికి గాయాలు

పోలీసులు ప్రజల కోసం కాకుండా... కేసీఆర్ కోసం, ఆయన కుటుంబం కోసం పని చేస్తున్నారని మండిపడ్డారు. తనకు కేసీఆర్ నుంచి, ఆయన గూండాల నుంచి ప్రాణహాని (Life Threat) ఉందని పేర్కొన్నారు. తన పాదయాత్ర కేసీఆర్ రాజకీయాలకు అంతిమయాత్ర అవుతుందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ఏపీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో వణుకు.. వర్క్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో 17 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై వేటు.. దాదాపు 350 మంది కమాటీల ఊస్టింగ్..

పాదయాత్రకు హైకోర్టు  అనుమతిని ఇచ్చినప్పటికీ... పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని... ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని అన్నారు. నర్సంపేటలో టీఆర్ఎస్ శ్రేణులు దాడులకు పాల్పడితే... తాము శాంతిభద్రతలకు విఘాతం కలిగించామని కేసులు నమోదు చేయడం ఏమిటని ఆమె మండిపడ్డారు.