AP Govt. Fires Out Sourcing Employees: ఏపీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో వణుకు..  వర్క్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో 17 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై వేటు.. దాదాపు 350  మంది కమాటీల ఊస్టింగ్..
File Photo

Vijayawada, Dec 5: ఆంధ్రప్రదేశ్ లోని (Andhrapradesh) కాంట్రాక్ట్ (Contract), ఔట్ సోర్సింగ్ (Out Sourcing) ఉద్యోగుల (Employees) కొలువులు గాలిలో దీపంలాగా మారాయి. డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అండ్ అకౌంట్స్ (Director of Works and Accounts) విభాగంలో పనిచేస్తున్న 17 మంది ఔట్  సోర్సింగ్ ఉద్యోగులపై ప్రభుత్వం వేటేసింది. సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోని గురుకుల వసతి గృహాల్లో పనిచేస్తున్న 350  మంది వంట కార్మికులు, కమాటీలు, సహాయకుల్ని తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఎదురుమాట్లాడితే ప్రభుత్వాలు కూలుస్తారా? మోదీ సర్కారుపై ఫైరయిన సీఎం కేసీఆర్, కేంద్రం పాలన పైన పటారం..లోన లొటారం అంటూ ఘాటు వ్యాఖ్యలు

దీంతో మిగతా విభాగాల్లోని ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో వణుకు మొదలైంది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు ఆదేశాలను వెనక్కి తీసుకోకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని కాంట్రాక్ట్, ఔట్  సోర్సింగ్, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక జేఏసీ చైర్మన్ (Contract, Out sourcing, Teachers, Labor JAC Chairman) ఏవీ నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఎం.బాలకాశి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ వికటించి వ్యక్తి మృతి, కిడ్నీ ఫెయిల్, ఇతర అవయవాలు పనిచేయకుండా నరకయాతన అనుభవించిన యువకుడు, సర్జరీ చేసిన డాక్టర్లు ట్రైనింగ్‌లో ఉన్నట్లు గుర్తింపు

కాగా, రాష్ట్రవ్యాప్తంగా 2.40 లక్షల మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో లక్ష మందిని ఆప్కాస్ విభాగంలోకి తీసుకురాగా, మిగతా 1.40 లక్షల మంది ఇంకా ఏజెన్సీలు, థర్డ్ పార్టీల ద్వారా సేవలందిస్తున్నారు. వీరిలో పదేళ్లలోపు సర్వీసు ఉన్నవారు 60 వేల మంది వరకు ఉంటారని అంచనా. పదేండ్ల కంటే తక్కువ సర్వీసు ఉన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వివరాలను ఇటీవల ప్రభుత్వం సేకరించడం తెలిసిందే.