Hair Transplant Death: హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ వికటించి వ్యక్తి మృతి, కిడ్నీ ఫెయిల్, ఇతర అవయవాలు పనిచేయకుండా నరకయాతన అనుభవించిన యువకుడు, సర్జరీ చేసిన డాక్టర్లు ట్రైనింగ్‌లో ఉన్నట్లు గుర్తింపు
Representational Image (Photo Credits: Pixabay)

New Delhi, DEC 04: హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ (Hair Transplant) ప్రక్రియ వికటించి 30 ఏళ్ల వ్యక్తి మరణించిన ఘటన ఢిల్లీ పరిధిలో జరిగింది. అథర్ రషీద్ అనే 30 ఏళ్ల వ్యక్తికి బట్టతల ఉంది. దీంతో అతడు ఢిల్లీలోని ఒక క్లినిక్‌లో ఇటీవల హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ (Hair Transplant Death) చేయించుకున్నాడు. అయితే, ఆ తర్వాత నుంచి అతడికి అనేక అనారోగ్య సమస్యలు ఎదురయ్యాయి. ట్రీట్‌మెంట్ తర్వాత నుంచి రషీద్ క్రమంగా అనారోగ్యానికి గురయ్యాడు. ముందుగా అతడి శరీరమంతా దద్దుర్లు మొదలయ్యాయి. తర్వాత కిడ్నీ ఫెయిల్ (Kidney Fail) అయ్యింది. మల్టీపుల్ ఆర్గాన్స్ ఫెయిలయ్యాయి (organs collapsed). ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రషీద్ (Rasheed) మరణించాడు. రషీద్‌కు తల్లి, ఇద్దరు చెల్లెల్లు ఉన్నారు. ఆ కుటుంబానికి అతడే ఆధారం. రషీద్ ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబానికి దిక్కులేకుండా పోయింది. దీంతో రషీద్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Lucknow Shocker: పీటల మీదనే గుండెపోటుతో కుప్పకూలిన పెళ్లికూతురు, దండలు మార్చుకుంటుండగానే ఒక్కసారిగా పడిపోయిన యువతి, షాక్‌లో వరుడు 

వైద్యుల నిర్లక్ష్యం వల్లే రషీద్ ప్రాణాలు పోయాయని కుటుంబ సభ్యులు ఆరోపించారు. తమలాంటి పరిస్థితి ఏ కుటుంబానికి రాకూడదని, అసలు హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ ప్రక్రియ ఒక మోసమని రషీద్ తల్లి వ్యాఖ్యానించింది. ఈ అంశంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేసిన ఇద్దరు నిపుణులతోపాటు, మరో ఇద్దరిని అరెస్టు చేశారు. రషీద్‌కు సర్జరీ చేసిన వ్యక్తులు ఇప్పుడే ట్రైనింగ్‌లో ఉన్నట్లు భావిస్తున్నారు.

Twins Married Same Man: ఆయనకిద్దరు! ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఇద్దరమ్మాయిలు, కేసు బుక్ చేసిన పోలీసులు, సినిమాను తలపిస్తున్న ట్రైయాంగిల్ లవ్ స్టోరీ 

హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ ప్రక్రియ వికటించి ప్రాణాలు కోల్పోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా పలువురు ప్రాణాలు కోల్పోయారు. 2019లో ముంబైకు చెందిన ఒక వ్యాపారవేత్త ఇలాగే ప్రాణాలు పోగొట్టుకోగా, 2021 సెప్టెంబర్‌లో గుజరాత్‌కు చెందిన ఒక వ్యక్తి హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ వల్లే మరణించాడు. అందుకే ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు.