Pinky and Rinky Married to Same Man. (Photo Credits: Twitter@News18lokmat)

Solapur, DEC 04: కవలలైన ఇద్దరు యువతులు ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ (Viral Clip) అయ్యింది. మహారాష్ట్రలోని షోలాపూర్ (Solapur) జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కవల సోదరీమణులైన పింకీ (Pinky), రింకీ (Rinky) ముంబైలో ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారు. కొంత కాలం కిందట వారి తండ్రి చనిపోయాడు. అయితే చిన్నప్పటి నుంచి నివసిస్తున్న ఇంటిలో తల్లితో కలిసి ఉంటున్నారు. కాగా, షోలాపూర్ జిల్లాలోని అక్లూజ్ (Akluz) గ్రామానికి చెందిన అతుల్ (Athul) అనే వ్యక్తి ముంబైలో ట్రావెల్‌ బిజినెస్‌ చేస్తున్నాడు. చూసేందుకు ఒకేలా ఉండే కవలలైన పింకీ, రింకీ కుటుంబంతో అతడికి పరిచయం ఏర్పడింది. ఒకసారి ఆ యువతులతోపాటు ఆమె తల్లి కూడా అస్వస్థతకు గురైంది. ఈ సందర్భంగా అతుల్‌ వారిని తన కారులో ఆసుపత్రికి తీసుకెళ్లాడు. నాటి నుంచి రింకీ, పింకీకి అతడు మరింత దగ్గరయ్యాడు. ఈ నేపథ్యంలో చిన్నప్పటి నుంచి కలిసి ఒకే ఇంట్లో ఉంటున్న ఆ కవల సోదరీమణులు అతుల్‌ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. ఈ వివాహానికి ఇరు కుటుంబాలు కూడా అంగీకరించాయి. దీంతో అతుల్‌ సొంత గ్రామమైన అక్లూజ్‌లో శుక్రవారం వారి పెళ్లి జరిగింది.

ఈ సందర్భంగా ఇద్దరు వధువులు ఒకే పూల దండను వరుడి మెడలో వేశారు. మరోవైపు కవల సోదరీమణులు ఒకే వ్యక్తిని పెళ్లాడిన ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ఈ పెళ్లి చెల్లుతుందా అని ఒకరు అనుమానం వ్యక్తం చేశారు. మీమ్స్‌, ఇమోజీలతో మరి కొందరు జోకులు వేశారు.

Chennai Woman Married 4 Times: ఈజీ మనీ కోసం నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న యువతి, ఐదో పెళ్లికోసం ట్రై చేస్తుండగా అడ్డంగా పోలీసులకు బుక్కయిన కిలాడీ, 12 ఏళ్లలో 32 సిమ్ కార్డులు, వాడినట్లు గుర్తింపు 

దీనికితోడు సోషల్ మీడియాలో వైరల్ అయిన పెళ్లి వీడియోల ఆధారంగా, వరుడిపై ఫిర్యాదులు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. వరుడు అతుల్ పై అక్లూజ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 494 ప్రకారం నాన్ కాగ్నిజబుల్ నేరం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.