YS Sharmila Case Update:వైయస్ షర్మిలకు 14 రోజుల రిమాండ్... చంచల్ గూడ జైలుకు తరలింపు.. నిన్న పోలీసులతో వాగ్వాదం అనంతరం చేయి చేసుకున్న షర్మిల... కేసు నమోదు.. బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ

ఆమెను చంచల్ గూడ జైలుకు తరలించారు. మే 8వ తేదీ వరకు ఆమె రిమాండులో ఉండనున్నారు.

YS Sharmila Arrest (Photo-Twitter/YS Sharmila)

Hyderabad, April 25: వైయస్సార్ తెలంగాణ పార్టీ (YSR Telangana Party) అధ్యక్షురాలు వైయస్ షర్మిల (YS Sharmila)కు నాంపల్లి కోర్టు (Nampally Court) 14 రోజుల రిమాండ్ (Remand) విధించింది. ఆమెను చంచల్ గూడ జైలుకు తరలించారు. మే 8వ తేదీ వరకు ఆమె రిమాండులో ఉండనున్నారు. సిట్ కార్యాలయాన్ని ముట్టడించిన అనంతరం టీ సేవ్ నిరాహార దీక్షలో భాగంగా ప్రతిపక్ష పార్టీల నేతలను కలిసి మద్దతు కోరాలని షర్మిల నిర్ణయించారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం ఇంటి నుండి షర్మిల బయలుదేరుతుండగా పోలీసులు అడ్డుకునే ప్రయత్నాలు చేయగా వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై చేయి చేసుకున్నందుకు గాను ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

YS Sharmila Arrest: పోలీసులతో వైఎస్ విజయమ్మ వాగ్వాదం, వైఎస్‌ షర్మిలను ఎందుకు అరెస్ట్ చేశారని మండిపాటు, బలవంతంగా కారులో ఎక్కించి అక్కడి నుంచి వెనక్కిపంపిన పోలీసులు

ఏ1గా షర్మిల

షర్మిల సహా ముగ్గురిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ1గా షర్మిల, ఏ2గా కారు డ్రైవర్ బాలు, ఏ3గా మరో డ్రైవర్ జాకబ్ పేర్లను చేర్చారు. షర్మిలను అరెస్టు చేసిన పోలీసులు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. కాగా, షర్మిల బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. షర్మిల బెయిల్ పిటిషన్ పై విచారణను న్యాయస్థానం నేటికి వాయిదా వేసింది.

TSPSC Paper Leakage: వైఎస్ షర్మిల అరెస్ట్, లోటస్ పాండ్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత, ఎస్సై, కానిస్టేబుల్ పై చేయి చేసుకున్న షర్మిల

 



సంబంధిత వార్తలు

Kamareddy: వివాహేతర సంబంధం...ముగ్గురి ప్రాణాలు తీసింది, ఎస్సై సహా మహిళా కానిస్టేబుల్ మరోకరి ఆత్మహత్య..కామారెడ్డిలో సంచలనంగా మారిన ముగ్గురి ఆత్మహత్యలు

Heavy Rain Alert For Telugu States: బంగాళాఖాతంలో కొన‌సాగుతున్న అల్ప‌పీడ‌నం, తెలుగు రాష్ట్రాల‌కు భారీ వ‌ర్ష‌సూచ‌న‌, ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం

Sandhya Theatre Stampede Case: వీడియో ఇదిగో, ఇరవై రోజుల తర్వాత స్పృహలోకి వచ్చిన శ్రీతేజ్, అల్లు అర్జున్, తెలంగాణ ప్రభుత్వం మాకు మద్దతు ఇస్తున్నారని తెలిపిన తండ్రి భాస్కర్

Sandhya Theatre Stampede Case: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో మొత్తం నిందితుల జాబితా ఇదే, ఏ-1 నుంచి ఏ-8 వరకు సంధ్య థియేటర్ యాజమాన్యం, ఏ-18గా మైత్రీ మూవీస్‌