Telangana Assembly Elections 2023: కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీ విలీనం సస్పెన్స్, కాంగ్రెస్ అగ్ర నేతలతో భేటీ అయిన షర్మిల, కేసీఆర్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్ అని వెల్లడి
గురువారం ఉదయం సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో ఆమె బ్రేక్‌ఫాస్ట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రాజకీయపరమైన చర్చ జరిగినట్లు స్పష్టమవుతోంది.
Hyd, August 31: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. గురువారం ఉదయం సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో ఆమె బ్రేక్‌ఫాస్ట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రాజకీయపరమైన చర్చ జరిగినట్లు స్పష్టమవుతోంది.
సోనియాగాంధీ, రాహుల్ గాంధీని కలిశాను. చాలా నిర్మాణాత్మక చర్చలు జరిగాయి. తెలంగాణ ప్రజలకు మేలు చేసే దిశగా నిరంతరం పనిచేస్తా. కేసీఆర్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయ్యింది అని భేటీ అనంతరం బయటకు వచ్చిన ఆమె మీడియాతో తెలిపారు. ఈ సమావేశంలో సోనియా, రాహుల్‌తో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. షర్మిల వెంట ఆమె భర్త అనిల్ కూడా ఉన్నారు.
కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీ విలీనం గురించి గత కొంతకాలంగా చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో ఇంతకుముందు ఆమె పలువురు కాంగ్రెస్ నేతలను కలవడంతో పాటు హస్తిన వెళ్లి పెద్దల్ని కలిసి వచ్చారు. ఆ మధ్య ఢిల్లీ నుంచి తిరిగి వస్తూ.. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డితో పాటు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆమె కనిపించారు. ఆ టైంలో షర్మిలను కాంగ్రెస్‌లోకి సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. అయితే విలీన ప్రస్తావనపై షర్మిల మాత్రం పెదవి విప్పలేదు.