Sharmila vs Kavitha: వైఎస్ షర్మిల వర్సెస్ కల్వకుంట్ల కవిత, తెలంగాణలో ముదిరిన ట్వీట్ వార్, వీరికి తోడైన బీజేపీ నేతలు

వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YSR Telangana Rashtra Samithi) నిరసన, నిర్భంధం, విడుదలకు సంబంధించిన వ్యవహారం హాట్ టాపిక్ గా మారగా ట్విట్టర్‌లో టీఆర్‌ఎస్‌, వైఎస్‌ఆర్‌టీపీ సభ్యులు వాగ్వాదానికి దిగారు

YSRTP leader,YS Sharmila (Photo-Video Grab)

Hyd, Nov 30: తెలంగాణలో రాజకీయ నేతల ట్వీట్లు తీవ్ర చర్చనీయాంశమైనాయి. వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YSR Telangana Rashtra Samithi) నిరసన, నిర్భంధం, విడుదలకు సంబంధించిన వ్యవహారం హాట్ టాపిక్ గా మారగా ట్విట్టర్‌లో టీఆర్‌ఎస్‌, వైఎస్‌ఆర్‌టీపీ సభ్యులు వాగ్వాదానికి దిగారు. వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కె.కవిత (TRS Legislator K Kavitha)మధ్య జరిగిన ట్విట్టర్‌ వాగ్వాదంతో పాటు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ వంటి ఇతర బీజేపీ నేతలు కూడా తమ ట్వీట్‌లతో విరుచుకుపడ్డారు.

వీడియో, వైఎస్ షర్మిల కారులో ఉండగానే క్రేన్ సహాయంతో పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు, కారు అద్దాలు మూసివేసి లోపలే కూర్చున్న షర్మిల

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై చేసిన ట్వీట్లు పలువురి దృష్టిని ఆకర్షించాయి. నిరసన సమయంలో వైఎస్ షర్మిలతో వ్యవహరించిన తీరును ఆమె తప్పుబట్టారు. అలాగే రాజకీయ నేతలు జి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కొండా సురేఖ ట్వీట్లను ట్యాగ్ చేస్తూ వైఎస్ షర్మిల ట్వీట్లను రీపోస్ట్ చేయడంతో, ఎమ్మెల్సీ కవిత వ్యంగ్య ట్వీట్లు చేశారు. ఈ ట్వీట్లు సోషల్ మీడియా వేదికగా చర్చకు దారితీశాయి.

Here's Tweets

ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిలను (YS Sharmila) పోలీసులు అరెస్ట్ చేయడం.. ఆ తర్వాత ఆమె బెయిల్ పై బయటకు వచ్చిన తరువాత టీఆర్ఎస్ పై, ముఖ్యమంత్రి కేసీఆర్ పై షర్మిల విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో షర్మిలపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ ద్వారా తొలిసారి విమర్శలు ఎక్కుపెట్టారు. బీజేపీ కోవర్టు షర్మిల అని విమర్శించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ట్వీట్ల వార్ జరిగింది.

వైఎస్ షర్మిలపై పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు, పోలీసులు గూండాల్లా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తిన వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు, వైఎస్‌ విజయమ్మను అడ్డుకున్న పోలీసులు

'తాము వదిలిన “బాణం”... తానా అంటే తందానా అంటున్న “తామర పువ్వులు”' అని తొలుత షర్మిలను ఉద్దేశించి కవిత వ్యాఖ్యానించారు. ఈ ట్వీట్ పై షర్మిల ఘాటుగా స్పందించారు. 'పాదయాత్రలు చేసింది లేదు.. ప్రజల సమస్యలు చూసింది లేదు.. ఇచ్చిన హామీలు అమలు లేదు.. పదవులే కానీ పనితనం లేని గులాబీ తోటలో ‘కవిత’లకు కొదవ లేదు' అని షర్మిల విమర్శించారు. షర్మిల వ్యాఖ్యలపై కవిత మరోసారి అదే స్థాయిలో రిప్లై ఇచ్చారు.

' అమ్మా.. కమల బాణం... ఇది మా తెలంగాణం... పాలేవో నీళ్ళేవో తెలిసిన చైతన్య ప్రజా గణం... మీకు నిన్నటిదాకా పులివెందులలో ఓటు... నేడు తెలంగాణ రూటు... మీరు కమలం కోవర్టు... ఆరేంజ్ ప్యారేట్టు... మీ లాగా పొలిటికల్ టూరిస్ట్ కాను నేను... రాజ్యం వచ్చాకే రాలేదు నేను... ఉద్యమంలో నుంచి పుట్టిన మట్టి " కవిత" ను నేను !' అంటూ షర్మిలపై విమర్శలు గుప్పించారు.



సంబంధిత వార్తలు

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్

Formula E Race Case: ఫార్ములా-ఈ కార్‌ రేసు కేసు, దమ్ముంటే ప్రభుత్వం అరెస్ట్ చేసుకోవచ్చని కేటీఆర్ సవాల్, రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు సిద్ధమవుతామని ప్రకటించిన బీఆర్ఎస్

Telangana Assembly Session 2024: అప్పులపై చర్చకు మేం సిద్ధం.. బీఆర్ఎస్ సిద్ధమా, సవాల్ విసిరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సవాల్‌ను స్వీకరిస్తున్నామని తెలిపిన హరీష్ రావు, వీడియోలు ఇవిగో..

Telangana: తెలంగాణలో భూమిలేని వారికి రూ.6 వేలు, సంచలన నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రాష్ట్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు ఇవిగో..